Lady: పోలీసు పైత్యం, హోటల్ యజమాని భార్య మీద ?, చాలాకాలం వెయిటింగ్, ఏం చేశాడంటే, సీన్ సిడేల్!
బెంగళూరు/ తుమకూరు: పోలీసు శాఖలో కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అమాయకుల దగ్గర అతని ప్రతాపం చూపిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం నుంచి డీఎస్పీ దగ్గర ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న కానీస్టేబుల్ ఇంకా రెచ్చిపోతున్నాడని సమాచారం. హోటల్ యజమాని భార్య మీద కన్ను వేసిన కానీస్టేబుల్ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే హోటల్ యజమాని భార్య ఆ పోలీసుకు లొంగలేదని తెలిసింది. హోటల్ లో టిఫిన్ చేసే ముసుగులో వెళ్లిన కానీస్టేబుల్ హోటల్ యజమాని బయటకు వెళ్లాడని తెలుసుకున్నాడు. ఆ సందర్బంలో రెచ్చిపోయిన కానీస్టేబుల్ హోటల్ యజమాని భార్య మీద లైంగికదాడి చేసి ఆమె మీద అక్కడే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

డీఎస్పీ దగ్గర స్పెషల్ డ్యూటీ
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలుకాలోని కేబీ క్రాస్ పోలీస్ స్టేషన్ లో మంజునాథ్ అలియాస్ మిలటరీ మంజు అనే వ్యక్తి కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసు శాఖలో కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అమాయకుల దగ్గర అతని ప్రతాపం చూపిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

హోటల్ యజమాని భార్య మీద పోలీసు కన్నుపడింది
కొంతకాలం నుంచి డీఎస్పీ దగ్గర ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న కానీస్టేబుల్ మంజునాథ్ ఇంకా రెచ్చిపోతున్నాడని సమాచారం. కిబ్బనహళ్లిలో తిపటూరుకు చెందిన వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ లో టిఫిన్ చెయ్యడానికి వెళ్లి వస్తున్న కానీస్టేబుల్ మంజునాథ్ హోటల్ యజమాని భార్య మీద కన్ను వేశాడు.

అందంగా ఉందని రెచ్చిపోయాడు
హోటల్ యజమాని భార్య మీద కన్ను వేసిన కానీస్టేబుల్ మంజునాథ్ కొంతకాలం నుంచి ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే హోటల్ యజమాని భార్య పోలీసు మంజునాథ్ కకు లొంగలేదని తెలిసింది. హోటల్ లో టిఫిన్ చేసే ముసుగులో వెళ్లిన కానీస్టేబుల్ మంజునాథ్ నీ భర్త ఎక్కడ అని ఆమెను అడిగాడు. హోటల్ యజమాని తుమకూరులో హోటల్ కు కావలసిన సరుకులు తీసుకురావడానికి వెళ్లాడని తెలుసుకున్న మంజునాథ్ రెచ్చిపోయాడు.

పోలీసు పైత్యం..... హోటల్ లో అరాచకం
మహిళ భర్త బయటకు వెళ్లాడని తెలుసుకున్న కానీస్టేబుల్ ఒకేఒక్కసారి తన కోరిక తీర్చాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. మర్యాదగా బయటకు వెళ్లిపోవాలని ఆమె చెప్పింది. ఆ సందర్బంలో రెచ్చిపోయిన కానీస్టేబుల్ మంజునాథ్ హోటల్ యజమాని భార్య మీద లైంగికదాడి చేసి ఆమె మీద అక్కడే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

పోలీసుకు దూలతీరిపోయింది
బాధితురాలు ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. తరువాత హోటల్ దగ్గరకు వెళ్లిన భర్త అతని భార్యను పిలుచుకుని వెళ్లి కానీస్టేబుల్ మంజునాథ్ మీద అత్యాచారయత్నం కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కానీస్టేబుల్ మంజునాథ్ హోటల్ యజమాని భార్య మీద లైంగిక దాడి చేసి అత్యాచారయత్నం చేశాడని వెలుగు చూడటంతో అరెస్టు చేసి అతన్ని తుమకూరు సెంట్రల్ జైలుకు తరలించడం తుమకూరు జిల్లాలో కలకలం రేపింది.