Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Leader: అధికార పార్టీ లీడర్ హత్య, నాయకులకు చుక్కలు చూపించిన కార్యకర్తలు, లాఠీచార్జ్!

బెంగళూరు/ మంగళూరు: బీజేపీ యువమోర్చలో చురుకుగా ఉంటున్న ప్రవీణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో అధికారంలో ఉన్న సొంతపార్టీ ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెలుతున్న సొంతపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీద బీజేపీ కార్యకర్తలు దాడి చెయ్యడం కలకలం రేపింది. హత్యకు గురైన యువకుడి అంతిమ యాత్ర సందర్బంగా కొందరు రాళ్ల వర్షం కురిపించారు. రాళ్లదాడిలో బీజేపీ నాయకులతో పాటు హిందూ సంఘ సంస్థ కార్యకర్తలకు గాయాలైనాయి.

పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘ, సంస్థ కార్యకర్తలకు తీవ్రగాయాలై ఆసుపత్రిపాలైనారు. మంగళవారం రాత్రి షాపు ముందు నిలబడి ఉన్న బీజేపీ నాయకుడిని బైక్ లో వెళ్లిన ప్రత్యర్థులు అతన్ని వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. ముస్లీం యువకుడి హత్యకు ప్రతీకారంగా బీజేపీ నాయకుడు హత్యకు గురైనాడని వెలుగు చూడటంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ లీడర్

బీజేపీ లీడర్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లార పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

రాజకీయాలు, వ్యాపారం

రాజకీయాలు, వ్యాపారం

దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కోళ్ల అంగడి నిర్వహిస్తున్న బీజేపీ నాయకుడు ప్రవీణ్ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కోళ్ల షాపు దగ్గర ఉంటున్నాడు. మంగళవారం రాత్రి కోళ్ల షాపు ముందు నిలబడి ఉన్న బీజేపీ నాయకుడు ప్రవీణ్ వేరేవ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.

వెంటాడి వెంటాడి నరికేశారు

వెంటాడి వెంటాడి నరికేశారు

కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ సందర్బంలో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికేశారు. కొడవళ్లతో దాడి చెయ్యడంతో ప్రవీణ్ కుప్పకూలిపోయాడు.

ఫలితంలేదు

ఫలితంలేదు

రక్తపుమడుగులో పడి ఉన్న ప్రవీణ్ ను వెంటనే పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. ప్రవీణ్ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుత్తూరులోని ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కేరళ బైక్ లో వెళ్లి హత్య

కేరళ బైక్ లో వెళ్లి హత్య

కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన నిందితులు బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ ను హత్య చేశారని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఈనెల 19వ తేదీన ఇదే ఊరిలో మసూద్ (19) అనే యువకుడు హత్యకు గురైనాడు. మసూద్ హత్యకు ప్రతీకారంగా బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య జరిగి ఉంటుందని అతని బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల లాఠీచార్జ్

బుధవారం ప్రవీణ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో రాళ్లతో దాడులు చెయ్యకూడదని పోలీసులు మనవి చేసినా కొందరు పట్టించుకోలేదు. ఆ సందర్బంలో పోలీసులు లాఠీలను పని చెప్పడంతో అనేక మందికి తీవ్రగాయాలైనాయి.

బీజేపీ నాయకులకు సినిమా

బీజేపీ నాయకులకు సినిమా

బీజేపీ యువమోర్చలో చురుకుగా ఉంటున్న ప్రవీణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో అధికారంలో ఉన్న సొంతపార్టీ ప్రభుత్వం మీద బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెలుతున్న బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ కారు మీద దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు అతని కారును పల్టీ కొట్టించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని నళిన్ కుమార్ కటీల్ ను అక్కడి నుంచి వెనక్కి పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+