Lovers: కారులో నుంచి లాగి బీర్ బాటిల్ తో ?, లవ్ జీహాద్ అని డౌట్, కారులో మహిళ చెప్పులు, చెక్ పోస్టులో!

మంగళూరు/ బెంగళూరు: రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు స్నేహితులు అయ్యారు. కొంతకాలం యువతి, యువకుడు కలిసి తిరుగుతున్నారు. మతాలు వేరు అయినా యువతి, యువకుడు ప్రేమించుకున్నారని తెలిసింది. యువకుడి కారులో ఆ యువతి బయలుదేరింది. చెక్ పోస్టు సమీపంలో కొందరు వ్యక్తులు కారును అడ్డగించారు. కారులో ఉన్న యువతి, యువకుడు పేర్లు అడిగారు. ఆ సమయంలో యువతి ఒక మతానికి చెందిన పేరు, యువకుడు మరో మతానికి చెందిన పేరు చెప్పారు. అంతే కారులో ఉన్న యువకుడిని బయటకు లాగిన కొందరు వ్యక్తులు అతన్ని చితకబాదేశారని తెలిసింది. బీరు బాటిల్ తో యువకుడి మీద దాడి చెయ్యడంతో అతనికి తీవ్రగాయాలైనాయి.

మతం మార్చడానికి మా మతానికి చెందిన యువతిని తీసుకెలుతున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. తీవ్రగాయాలైన యువకుడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఇదే సమయంలో యువకుడి మీద దాడి చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేశామని సిటీ పోలీసు కమీషనర్ అన్నారు. కారులో మహిళ చెప్పులు చిక్కడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

వేర్వేరు మతాలు

వేర్వేరు మతాలు

కర్ణాటకలోని మంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ రియాజ్ అనే యువకుడు, హిందూ మతానికి చెందిన యువతి స్నేహితులు అయ్యారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు దగ్గర అయ్యారు. కొంతకాలం నుంచి ఆయువతి, అబ్దుల్ రియాజ్ తో కలిసి తిరుగుతున్నారని సమాచారం.

చెక్ పోస్టు దగ్గర పేర్లు అడిగారు

చెక్ పోస్టు దగ్గర పేర్లు అడిగారు

మతాలు వేరు అయినా ఆ యువతి. అబ్దుల్ రియాజ్ ప్రేమించుకున్నారని తెలిసింది. అబ్దుల్ రియాజ్ కారులో ఆ యువతి బయలుదేరింది. మంగళూరు నగరం సమీపంలోని పడు చెక్ పోస్టు సమీపంలో కొందరు వ్యక్తులు కారును అడ్డగించారు. కారులో ఉన్న యువతి, యువకుడు పేర్లు అడిగారు. ఆ సమయంలో యువతి ఒక మతానికి చెందిన పేరు, అబ్దుల్ రియాజ్ అనే యువకుడు మరో మతానికి చెందిన పేరు చెప్పారు.

కారులో నుంచి కిందకు దింపి చితకబాదేశారు

కారులో నుంచి కిందకు దింపి చితకబాదేశారు

కారులో ఉన్న అబ్దుల్ రియాజ్ అనే యువకుడిని బయటకు లాగిన కొందరు వ్యక్తులు అతన్ని చితకబాదేశారని తెలిసింది. బీరు బాటిల్ తో అబ్దుల్ రియాజ్ మీద దాడి చెయ్యడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. మతం మార్చడానికి మా మతానికి చెందిన యువతిని అబ్దుల్ రియాజ్ తీసుకెలుతున్నాడని మంగళూరులోని కొందరు ఆరోపిస్తున్నారు.

కలకలం రేపింది.... నలుగురి అరెస్టు

కలకలం రేపింది.... నలుగురి అరెస్టు

అబ్దుల్ రియాజ్ మీద దాడి చేసిన వ్యక్తులు అతన్ని అక్కడి నుంచి తరిమితరిమి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రగాయాలైన అబ్దుల్ రియాజ్ అనే యువకుడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఇదే సమయంలో యువకుడి మీద దాడి చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేశామని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఎన్. శివకుమార్ అన్నారు. అయితే అరెస్టు అయిన వారి పేర్లు మాత్రం పోలీసులు బయటకు చెప్పడం లేదు.

కారులో మహిళ చెప్పులు

కారులో మహిళ చెప్పులు

కారులో మహిళ చెప్పులు చిక్కడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో హిందూ అమ్మాయిలను కొందరు ముస్లీం యువకులు ప్రేమ పేరుతో వలలో వేసుకుని లవ్ జీహాద్ పేరుతో మతం మార్చుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంగళూరులో ముస్లీం యువకుడి మీద కొందరు దాడి చెయ్యడంతో కొన్ని ప్రాంతాల్లో టెన్షన్ వాతవరణం నెలకొందని స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+