పెళ్లి జరిగి నెల పూర్తి కాకుండానే రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ, బర్త్ డే పార్టీలో!

బెంగళూరు/విజయపుర: యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడికి పెద్దలు పెళ్లి సెట్ చేశారు. యువతి, యువకుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్షల రూపాయల ఖర్చు చేసి ఇటీవల వీరి పెళ్లి జరిపించారు. వివాహం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే నవదంపతులు రోడ్డు ప్రమాదంలో స్పాట్ లో చనిపోవడంతో ఇరువైపుల కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

బైక్‌, క్యాంటర్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో నవ దంపతులు రోడ్డుపైనే మృతిచెందారు. పెళ్లయిన 24 రోజులకే దంపతులు చనిపోయారు. కర్ణాటకలోని విజయపుర నగర శివార్లలోని షోలాపూర్ బైపాస్ రోడ్డు సమీపంలో అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బైక్‌, క్యాంటర్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అన్నారు.

newlyweds died in a road accident

మృతులను హోనమల్లన్న అలియాస్ మల్లన్న (31), అతని భార్య గాయత్రి (24)గా గుర్తించామని పోలీసులు అన్నారు. మృతుడు మల్లన్న విద్యాశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే సంవత్సరం మే 22వ తేదీన హోనమల్లన్న, గాయత్రిల వివాహం జరిగింది. పెళ్లయిన 24 రోజులకే పక్క ఊరికి వెళ్తి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి వివరాలు సేకరించారు.

బంధువుల పిల్లల పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన మల్లన్న, గాయిత్రీ దంపతులు తిరిగి వస్తుండగా రాత్రి ప్రమాదం జరిగింది. విజయపుర మొబైల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా, మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు మార్చురీ దగ్గర కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. లక్షలాది రూ. ఖర్చుపెట్టి గత నెలలోనే పెళ్లి చేసుకున్న ఈ జంట ఎన్నో కలలు కన్నారు. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు.

ఇదిలా ఉండగా ఇద్దరు మృతి చెందారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంధువల పిల్లల పుట్టినరోజు వేడుకలు జరుపుకుని బంధువుల ఇంట్లో భోజనం చేసిన నవ దంపతులు మల్లన్న, గాయిత్రీని వారి ఇంట్లో ఉండమని బంధువులు చెప్పారు. మీరు కొత్తగా పెళ్లయిన జంట అని, రాత్రిపూట ప్రయాణం చేయకూడదని బంధువులు మల్లన్న, గాయిత్రీకి చెప్పారు.

అయినా వినకుండా రేపు ఉదయం తాను ఉద్యోగానికి వెళ్లాలని మల్లన్న అతని భార్య గాయిత్రీతో బైక్ లో బయలుదేరాడని, వాళ్లు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది నిమిషాలకే కుటుంబ సభ్యులకు ఇద్దరి మరణవార్త వచ్చిందని పోలీసులు తెలిపారు. వివాహం జరిగిన నెల రోజుల ముందే దంపతులు ఇద్దరూ ఒకే సారి చనిపోవడంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+