Contractor: కాంట్రాక్టర్ ఫ్యామిలీలో ఒకేసారి బయటపడిన ముగ్గురి శవాలు, సోదరి ఫోన్ చేస్తే?

బెంగళూరు: కాంట్రాక్టర్ అతని తల్లి, అక్కతో కలసి ఒకే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. కాంట్రాక్ట్ పనులు చేస్తున్న యువకుడి మరో సోదరికి పెళ్లి అయ్యింది. ఆమె భర్త ఇంటిలో ఉంటున్నది. రాత్రి అపార్ట్ మెంట్ లోకి వెళ్లిన కాంట్రాక్టర్ అతని కుటుంబ సభ్యులు ఎవ్వరూ బయటకు రాలేదు. పోలీసులు వెళ్లి చూస్తే ముగ్గురు శవమై కనిపించారు.

బెంగళూరు సిటీలోని మహాలక్ష్మి లేఔట్ లోని శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ స్ట్రీట్ లో యశోధ (70) అనే మహిళ నివాసం ఉంటున్నారు. యశోధాకు సుమనా గుప్తా (42), అపర్ణా గుప్తా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు నరేష్ గుప్తా (37) అనే కుమారుడు ఉన్నాడు. అపర్ణా గుప్తా వివాహం చేసుకుని బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లోని ఆమె భర్త ఇంటిలో ఉంటున్నది.

Three suicides in a contractors family in Bengaluru at the same time

మూడు రోజుల క్రితం యశోధా, ఆమె కుమార్తె సుమనా గుప్తా, కుమారుడు నరేష్ గుప్తా రాజాజీనగర్ లో నివాసం ఉంటున్న అపర్ణా గుప్తాకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. మరుసటి రోజు అపర్ణా గుప్తా ఆమె తల్లి యశోధాకు ఫోన్ చేస్తే ఆమె రిసీవ్ చెయ్యలేదు. తరువాత సోదరి సుమనా గుప్తాకు, సోదరుడు నరేష్ గుప్తాకు ఫోన్ చేసినా ఎవ్వరూ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. రెండు రోజుల నుంచి అపర్ణా ఫోన్ చేసినా ఎవ్వరూ రిసీవ్ చెయ్యలేదు.

అపర్ణా గుప్తాకు అనుమానం వచ్చి మంగళవారం మద్యాహ్నం మహాలక్ష్మిలోని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లి చూసింది. అపార్ట్ మెంట్ లోపల లాక్ చేసి ఉండటంతో అపర్ణా గుప్తా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తలుపులు పలగొట్టి చూడగా లోప యశోధ, సుమన గుప్తా, నరేష్ గుప్తా శవాలై కనిపించారు. ముగ్గురు విషం సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నరేష్ గుప్తా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడని పోలీసులు అన్నారు. నరేష్ గుప్తాకు, అతని సోదరి సుమనా గుప్తాకు ఇంకా పెళ్లి కాలేదని పోలీసులు చెప్పారు. నరేష్ గుప్తాకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా ?, పెళ్లి కాలేదని ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా ? అని దర్యాప్తు చేస్తున్నామని మహాలక్ష్మి లేఔట్ పోలీసులు తెలిపారు. కాంట్రాక్టర్ ఫ్యామిలీలో ఒకేసారి ముగ్గురు శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+