Pathan: షారూక్ ఖాన్ కు సినిమా చూపించిన వీహెచ్ పీ, ఐటీ హబ్ లో దీపికాకు షాక్, నిప్పుపెట్టి నిరసన!
పఠాన్ సినిమా పోస్టర్లు, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె ఫోటోలు, పఠాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పఠాన్ సినిమా విడుదలైన థియేటర్ల ముందు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
బెంగళూరు/ అహమ్మదాబాద్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన పఠాన్'చిత్రాన్ని ప్రదర్శించకూడదని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బుధవారం బెంగళూరులో నిరసనకు దిగారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు వ్యతిరేకంగా వీహెచ్‌పీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదే సమయంలో పఠాన్ సినిమా పోస్టర్లు, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె ఫోటోలు, పఠాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పఠాన్ సినిమా విడుదలైన థియేటర్ల ముందు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

పఠాన్ సినిమాపై నిరసనలు
పఠాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టిన వీహెచ్ పీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ సినిమాలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని వీహెచ్‌పీ కార్యకర్తలు ఆరోపిస్తూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) పర్యటన సందర్బంగా నటి దీపికా పదుకొణె తుక్డే తుక్డే గ్యాంగ్ అతని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆమెకు వ్యతిరేకంగా వీహెచ్ పీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

బెంగళూరు నర్తకి థియేటర్ లో?
హిందూ అనుకూల కార్యకర్తలు, హిందూ సంఘ సంస్థలు బెంగళూరులోని నర్తకి థియేటర్ల ముందు నిరసన వ్యక్తం చేస్తూ పఠాన్ సినిమా చేసి సినిమా పోస్టర్లను చించివేసి నిప్పంటించారు. పఠాన్ సినిమాను బహిష్కరించాలని హిందువులకు వీహెచ్ పీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పఠాన్ సినిమా విడుదలను ఖండిస్తూ షారూక్ ఖాన్ ఫోటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్లు బూడిద చేశారు.
బెళగావి, కలబురిగిలో ఫైర్
నరక్తి థియేటర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కర్ణాటకలో కలబురగిలో పఠాన్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌పై కొందరు హిందూ సంస్థల కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. బెళగావిలోని థియేటర్లలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతోపాటు హింసకు పాల్పడినందుకు పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలోని బెంగళూరు, కలబురగి, బెళగావి తదితర ప్రాంతాల్లో దాదాపు 30 మంది హిందూ సంఘ సంస్థల కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరువాత విడుదల చేశారు.

మాల్ లో కూడా పఠాన్ కు నిరసన సెగ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ మాల్‌లో వీహెచ్‌పీ యువజన విభాగం నాయకులు, బజరంగ్ దళ్ కార్యకర్తులు పఠాన్ సినిమా పోస్టర్లను చించి నిరసనకు దిగారు. బేషరమ్ రంగ్ పాట విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా పలు హిందూ సంఘ, సంస్థలు పఠాన్ సినిమాపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాటలో దీపిక పదుకొణె కుంకుమపువ్వు రంగులో బికినీ వేసుకుని అసభ్యంగా నటించడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. సినిమాల విషయంలో అనవసరమైన ప్రకటనలు, వ్యాఖ్యలు చెయ్యకూడదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు, నేతలకు సూచించడంతో పఠాన్ సినిమా విషయంలో వాళ్లు వెనక్కితగ్గారు.












Click it and Unblock the Notifications