viral video: చనువిస్తే చేయేస్తావా? -కర్ణాటక బాలయ్య డీకే శివకుమార్ ఉగ్రం -రౌడీవంటూ బీజేపీ ఫైర్

అభిమానం కొద్దీ దగ్గరగా వెళ్లే అభిమానుల్ని లాగిపెట్టి కొట్టడం, సెల్ఫీలు దిగబోతే ఫోన్లను నేలకేసి కొట్టడం తెలుగునాట టీడీపీ నేత బాలయ్యకు బాగా అలవాటైన పని. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ అలాంటి శాల్తీ ఒకటుంది. పేరు డీకే శివకుమార్. కాంగ్రెస్ లోని టాప్ మోస్ట్ ట్రబుల్ షూటర్లలో ఒకరిగా పేరుపొందిన ఆయన ప్రస్తుతం కర్ణాటక పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. గతంలో పలుమార్లు కార్యకర్తలపై చేయి చేసుకున్న డీకే మరోసారి ఉగ్రరూపం ప్రదర్శించారు..

కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించిన ఓ కార్యకర్త చెంప పగలగొట్టారు. సదరు వీడియో నెట్టింట వైరల్ కావడంతో డీకేను రౌడీతో పోల్చుతూ బీజేపీ విమర్శలు గుప్పించింది.

viral video: karnataka pcc chief DK Shivakumar Slaps Congress Worker, BJP calls it rowdy

పార్టీ సీనియర్‌ నేతను పరామర్శించేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ శుక్రవారం మండ్యాలో పర్యటించారు. పరామర్శ అనంతరం నడుస్తూ బయటకు వస్తుండగా ఓ కార్యకర్త భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఆగి వెంటనే కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ''చనువు ఇస్తే చేయి వేయడానికి ప్రయత్నిస్తావా'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలోనూ తనతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వారి సెల్‌ఫోన్లను డీకే విసిరేసిన ఘటనలు ఉన్నాయి. తాజా ఘటన నేపథ్యంలో శివకుమార్ పై బీజేపీ విమర్శలు చేసింది. సొంత పార్టీ కార్యకర్తపై నలుగురిలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కూడా డీకే ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని బీజేపీ విమర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+