దక్షిణాఫ్రికాలో తిండి పోటీ: సమోసాకు ఫస్ట్ ప్రైజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

జొహన్స్‌బర్గ్స్: దక్షిణాఫ్రికాలో చిరుతిళ్ళ పోటీలో కాశ్మీర్ చిల్లి చికెన్‌తో చేసిన సమోసా విజేతగా నిలిచింది.భారతీయుల వంటకాలకు మరోసారి విదేశాల్లో అరుదైన గౌరవం దక్కింది.ఈ సమోసాను తిన్న ఆహరప్రియులు సమోసా రుచిని ఆస్వాదించారు.

దక్షిణాఫ్రికాలో వీక్లీ పోస్ట్‌ అనే మీడియా సంస్థ చిరుతిళ్ల పోటీ పెట్టింది. ఇందులో ఛాక్లెట్‌, జీడిపప్పు వంటకాలు, పిజ్జాల లాంటి వాటిని కూడా వెనక్కి నెట్టి కశ్మీరీ చిల్లీ చికెన్‌ సమోసా తొలి స్థానంలో నిలిచింది. సల్మా అగ్జే అనే మహిళ ఈ సమోసాను తయారుచేశారు.

ఈ పోటీలో తన వంటకం గెలవడం ఆనందంగా ఉందని సల్మా చెప్పారు. తనకు వంట చేయడం చాలా ఇష్టమన్నారు.ఇతరుల కంటే భిన్నంగా ఆహరపదార్ధాలను వండడంలో ప్రత్యేకతను చూపుతానని ఆమె చెప్పారు.దీంతో తాను చేసే వంటకాలకు కొంత డిఫరెంట్ రుచి ఉంటుందన్నారామె.

Kashmiri chilli chicken filled samosa wins contest in South Africa

దీంతో పాటు మరో రెండు పోటీలను కూడా నిర్వహించారు. వేగంగా సమోసాలు తయారుచేసే పోటీ పెట్టగా.. అందులో 63ఏళ్ల రోక్సానా నసీమ్‌ అనే మహిళ విజేతగా నిలిచారు. 60 సెకండ్లలో ఆమె 10 సమోసాలను తయారుచేశారు.

ఇక వేగంగా సమోసాలు తినే పోటీ పెడితే..ఇబ్రహీం బక్స్‌ అనే వ్యక్తి గెలుపొందాడు. ఆయన ఒక్క నిమిషంలో 10సమోసాలను తిన్నాడు. దక్షిణాఫ్రియాలో జరిగిన పోటీలో సమోసా స్థానం దక్కించుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Popular Indian snack samosa with Kashmiri chilli chicken fillings has beaten chocolate, cashew nuts and other exotic entries in a first such contest in South Africa.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి