షాకింగ్: 20 దెయ్యాలతో శృంగారం.. 27 ఏళ్ల మహిళ అనుభవం! దిమ్మతిరిగే నిజాలు...

Recommended Video

    Bizzare :ఒకే దెయ్యం అయితే ఒకే అనుభవం : లోదుస్తులు మాత్రమే ధరించి రెచ్చగొట్టేదాన్ని | Oneindia Telugu

    బ్రిటన్: దెయ్యం అంటేనే చాలామందికి భయం. అలాంటిది ఏకంగా దెయ్యంతో శృంగారం అంటే.. ఎలా ఉంటుంది? కానీ ఓ మహిళ మనుషులతో కంటే దెయ్యాలతోనే శృంగారం బాగుంటుందని సెలవిస్తోంది. అదేంటి అంటే, అంతేమరి.. మనిషి తోడు ఎలాగూ లేదు, కనీసం దెయ్యాలతోనైనా ఎంజాయ్ చెయ్యొద్దా? అని ఎదురు ప్రశ్నిస్తోంది.

    అరె, అసలు దెయ్యం కంటికే కనిపించదు, ఇక దెయ్యంతో శృంగారమా? అంతా అబద్ధం అని కొట్టిపారేయకండి. కంటికి కనిపించకపోతే ఏం.. ఒంటికి స్పర్శ తెలియదా? అని ఎదురు ప్రశ్నిస్తోంది ఈ మహిళ. పైపెచ్చు మనుషులతో కలిగే అనుభూతే.. వాటితోనూ అంటూ ముసిముసిగా నవ్వేస్తోంది.

     పదేళ్ల కిందట మొదలైన కథ...

    పదేళ్ల కిందట మొదలైన కథ...

    దెయ్యాలతో తాను శృంగారంలో పాల్గొన్నానని అమెథిస్ట్ రియల్మ్(27) అనే మహిళ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. ఆమె ఈ విషయాన్ని ఇటీవల ఐటీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘దిస్ మార్నింగ్' అనే కార్యక్రమంలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే... యూకేలోని బ్రిస్టల్‌లో అమెథిస్ట్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సెలర్‌గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. ఆ సమయంలో వాళ్లు కొత్తగా ఓ ఇల్లు కొనుక్కున్నారట. అమెథిస్ట్ భర్త ఏమో ఎక్కువగా ఇంటిపట్టున ఉండేవాడు కాదు. టూర్ అంటూ నెలలో ఎక్కువ రోజులు అటూ ఇటూ తిరుగుతుండే వాడు. దీంతో అమెథిస్ట్ తమ కొత్త ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చేది.

    ఆ ఇంట్లో ఒక దెయ్యం...

    ఆ ఇంట్లో ఒక దెయ్యం...

    విశాలమైన ఇల్లు.. అందులో ఒంటరిగా అమెథిస్ట్. ఆ ఇంట్లో ఓ దెయ్యం ఉండేదట. రాత్రిళ్లు ఒంటరిగా ఉండే అమెథిస్ట్‌తో ఆ దెయ్య పరిచయం పెంచుకుంది. పైగా అది మగదెయ్యం. అసలే కొత్తగా పెళ్లయింది. భర్త ఏమో దగ్గర లేడు. వయసులో ఉన్న స్త్రీకి శారీరక కోరికలు కలగవా? అమెథిస్ట్ విషయంలోనూ అదే జరిగింది. ఒకరోజు ఆ పురుష దెయ్యంతో శృంగారంలో పాల్గొనాలనే కోరిక అమెథిస్ట్‌కు కలిగింది. దీంతో ఆమె ఆ దెయ్యాన్ని కవ్వించి రెచ్చగొట్టాలని నిర్ణయించుకుందట. రాత్రిళ్లు ఒంటిపై కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి దెయ్యాన్ని రెచ్చగొట్టేదట. అలా అమెథిస్ట్, ఆ పురుష దెయ్యం ఒక్కటయ్యారట. ఒకటి, రెండు రోజులు కాదు ఈ సంబంధం మూడేళ్లపాటు నడిచిందట.

     పసిగట్టి నిలదీసిన భర్త...

    పసిగట్టి నిలదీసిన భర్త...

    ఓరోజు ఈ విషయం అమెథిస్ట్ భర్తకు తెలిసిందట. ఈ విషయంలో అతడు ఆమెను నిలదీయడంతో ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఆ దెయ్యమే అమెథిస్ట్‌తో తనకు ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు వివరించిందట. అయితే.. అదే ఆఖరుసారి .. మళ్లీ ఆ దెయ్యం అమెథిస్ట్ దగ్గరికి రాలేదట. ఇంతటితో ఈ కథ ఆగిపోతే ఇంత సంచలనం అయ్యేది కాదు. ఆ తరువాత కూడా అమెథిస్ట్ మరో దెయ్యంతో సెక్సువల్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందట. ఇలా.. మొత్తం 20 దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నదట. అంతేకాదు, ఆ దెయ్యాలతో సంతానాన్ని కూడా కని, ఓ ఘోస్ట్ ఫ్యామిలీని మెయిన్‌టెయిన్ చేయాలని కూడా అమెథిస్ట్ అనుకుందట.

    దెయ్యంతో సంతానం.. అందుకు రీసెర్చ్...

    దెయ్యంతో సంతానం.. అందుకు రీసెర్చ్...

    ఈ ఆలోచన వచ్చిందే తడువుగా ‘అసలు దెయ్యంతో బిడ్డను కనడం ఎలా?' అనే అంశంపై ఆమె రీసెర్ఛ్ కూడా మొదలెట్టిందట. మనలో మనమాట అంటూ శృంగారం అనేది మనుషులతో కంటే దెయ్యాలతోనే బాగుంటుందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిందామె. ఈ విషయాలన్నింటినీ.. అమెథిస్టే స్వయంగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ షోను హోస్ట్ చేస్తున్న నిర్వాహకులు ఈమె చెబుతున్నది నిజామా? అబద్దమా? అర్థంకాక తెల్లమొహం వేశారట.

     కంటికే కనపడవు.. మరి నీకెలా?

    కంటికే కనపడవు.. మరి నీకెలా?

    అయితే.. ఈ షో హోస్ట్ కొంచెం తెలివిగా.. అసలు అమెథిస్ట్ నిజం చెబుతుందా? అబద్ధం చెబుతుందా? అని తెలుసుకోవడానికి ఓ ప్రశ్న వేశాడట. ఏంటంటే.. అసలు.. దెయ్యాలు కంటికి కనిపించవు కదా.. మరి నీకు ఇరవై దెయ్యాలతో సంబంధం ఉందని నీకెలా తెలుసు? ఒకే దెయ్యం నీ దగ్గరికి ఇరవైసార్లు వచ్చి ఉండొచ్చుకదాని. ఈ ప్రశ్నకు అమెథిస్ట్ ఏం చెప్పిందో తెలుసా? ‘‘కంటికి కనపడకపోతే ఏం.. ఒంటికి తెలిసిపోతుంది కదా.. ''అంటూ ముసిముసినవ్వులు చిందించింది అమెథిస్ట్. అంతేకాదు, ‘‘ఒకే దెయ్యం అయితే.. ‘ఆ' అనుభవం ఒకేరీతిలో ఉంటుంది. కానీ.. ప్రతిసారి నాకు కొత్త కొత్త అనుభవాలు ఎదురయ్యేవి.. శృంగారంలో పాల్గొనడం ఒకటే అయినా.. వేర్వేరు దెయ్యాల ఎనర్జీ లేవల్స్ కచ్చితంగా వేర్వేరుగా ఉంటాయి. అలా నేను వేర్వేరు దెయ్యాలతో శృంగారంలో పాల్గొంటున్నట్లు నాకు తెలిసేది..''అంటూ తన అనుభవాన్ని వివరించిందామె.

     దెయ్యంతో శృంగారానుభవం ఇలా...

    దెయ్యంతో శృంగారానుభవం ఇలా...

    సరే.. అసలు నువ్వు దెయ్యంతో శృంగారంలో పాల్గొంటున్నావని నీకెలా తెలిసిందంటూ సదరు టీవీ షో నిర్వాహకులు మరో ప్రశ్న వేశారట. అప్పుడు అమెథిస్ట్ ఏం చెప్పిందంటే.. ‘‘ఆ సమయంలో నామీద ఏదో బరువు పడుతున్నట్లు అనిపించేది... కంటికి కనబడకపోయినా ఎవరో నామీద పడుకున్నట్లు అనిపించేది. అంతేకాదు, మనుషులతో శృంగారం చేస్తే ఎటువంటి ఫీలింగ్స్ కలుగుతాయో.. అవే ఫీలింగ్స్ నాకు కలిగేవి..'' అందామె. ఇంకెవరేం చేస్తారు.. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నానంటూ ఇన్ని ఉదాహరణలు చెబుతుంటే. దీంతో ఆ షో నిర్వాహకులు సైతం అమెథిస్ట్‌ను... దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్న మహిళగా ఫిక్స్ అయిపోయారట. మొత్తానికి దెయ్యాలైనా శ‌ృంగారంపై మక్కువ చావదన్నమాట. మరి జాగ్రత్త!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+