భూమిపై ‘కదిలే కోట’: పుతిన్ కార్ రహస్యాలు బయటకు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉపయోగించే అధికారిక వాహనం 'అవురస్ సెనాట్'కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు, ఇది దాదాపు ఏ రకమైన దాడినైనా తట్టుకునేలా రూపొందించబడిన ఒక కదిలే కోట. ఇది అత్యంత భారీ ఆర్మర్డ్ లగ్జరీ లిమోసిన్. పుతిన్ తన భారత పర్యటన కోసం ఈ సెనాట్‌ను ప్రత్యేకంగా మాస్కో నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకువస్తున్నారు.

సెనాట్‌ను రష్యా కార్ల తయారీ సంస్థ అవురస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. దీనిని తరచుగా 'ఫోర్ట్రెస్-ఆన్-వీల్స్(చక్రాలపై ఉన్న కోట)' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, లగ్జరీ అంశాలను కలిగి ఉంటుంది. సెనాట్ పూర్తి-పరిమాణ లగ్జరీ లిమోసిన్. దీనిని 2018లో పరిచయం చేశారు. ఇది వ్లాదిమిర్ పుతిన్ అధికారిక స్టేట్ కారుగా ఉంది. సెనాట్ రష్యా ప్రభుత్వ వినియోగం కోసం దేశీయ లగ్జరీ, ఆర్మర్డ్ వాహనాలను నిర్మించడానికి ఉద్దేశించిన "కోర్టెజ్" ప్రాజెక్ట్‌లో భాగం.

A Fortress on Wheels Vladimir Putin Official State Missile Proof Car Aurus Senat

మోదీతో సెనాట్ ప్రయాణం
పుతిన్ ఉపయోగించే ఈ సెనాట్‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమ్మిట్ సందర్భంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ సెనాట్‌లోనే ప్రయాణించడం విశేషం.పుతిన్ తన వ్యక్తిగత భద్రతకు ఇచ్చే ప్రాధాన్యతను సెనాట్‌ను ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించడం స్పష్టం చేస్తోంది. అత్యున్నత స్థాయి భద్రతతో పాటు, రష్యా దేశీయ సాంకేతిక శక్తిని కూడా ఈ వాహనం ప్రతిబింబిస్తుంది. దీని అత్యుత్తమ భద్రతా లక్షణాలు, పనితీరు గురించి వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

అసాధారణ భద్రతా లక్షణాలు
పుతిన్ సెనాట్‌ను దాదాపు అన్ని రకాల దాడుల నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కారు పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్. అంతేకాకుండా ఇది మిస్సైల్ లేదా డ్రోన్ దాడి ప్రభావాన్ని కూడా గణనీయంగా తగ్గించగలదు. దీనివల్ల లోపల ఉన్న వ్యక్తి దాడి నుంచి సురక్షితంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఈ కారులో గాలిని శుద్ధి చేసే అత్యాధునిక సాంకేతికత అమర్చబడి ఉంది. దీని ద్వారా బయట ఏదైనా రసాయనిక దాడి జరిగినా, కారు లోపలి గాలి శుభ్రంగా ఉండి ప్రయాణీకుడు సురక్షితంగా ఉంటారు. ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ ఇందులో ఉంది. ఒకవేళ కారు టైర్లు పేలినా కూడా, అది ఆగకుండా అదే వేగంతో పరుగులు తీయగలదు. అత్యంత ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే.. ఈ కారు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినా, అది మునిగిపోకుండా జలాంతర్గామి లాగా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

పనితీరు, ఇంజిన్
సెనాట్ అత్యంత భారీగా ఉన్నప్పటికీ, దీని పనితీరులో రాజీ పడలేదు. ఈ లగ్జరీ కారు 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్తో శక్తిని పొందుతుంది, దీనికి హైబ్రిడ్ సిస్టమ్ కూడా జోడించబడింది. ఈ భారీ వాహనం కేవలం 6 నుంచి 9 సెకన్లలోనే 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం సుమారు 160 కి.మీగా ఉంది.

ధర
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అవురస్ సెనాట్ లిమోసిన్ బేస్ మోడల్ ధర సుమారు 18 మిలియన్ రూబుళ్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 2.5 కోట్లు) ప్రారంభమవుతుంది. అయితే పుతిన్ కోసం ప్రత్యేకంగా జోడించిన అత్యాధునిక ఆర్మర్, భద్రతా ఫీచర్ల కారణంగా, ఈ కారు అసలు ధర బేస్ మోడల్ ధర కంటే రెండు రెట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. పుతిన్ తన విదేశీ పర్యటనలకు కూడా ఈ సెనాట్‌ను వెంట తెచ్చుకోవడం, తన భద్రత విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+