చౌక ధరకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 200కిలోమీటర్ల రేంజ్, మెటల్ బాడీతో అదుర్స్!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మార్కెట్లోకి తమ అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఏథర్ కోనార్క్'ను అధికారికంగా విడుదల చేసింది కంపెనీ రూపొందించిన సరికొత్త 'EL ప్లాట్‌ఫామ్' ఆధారంగా నిర్మించిన తొలి స్కూటర్ ఇది. ఇప్పటివరకు తీసుకొచ్చిన మోడళ్లకు భిన్నంగా మొదటిసారిగా మెటల్ బాడీ, స్టీల్ యూనిబాడీ ఛాసిస్‌తో దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. వినియోగదారుల సౌకర్యార్థం స్మార్ట్ రిమోట్ కీతో సహా అనేక ఆధునిక హంగులను ఇందులో పొందుపరిచారు.

కార్లకు నకిలీ సైలెన్సర్లు ఎందుకు?.. వీటి వెనుక ఇంత పెద్ద కారణముందా?
కార్లకు నకిలీ సైలెన్సర్లు ఎందుకు?.. వీటి వెనుక ఇంత పెద్ద కారణముందా?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ 'ఎయిర్‌వాక్'. ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాన్ని ముందుకు, వెనక్కి సులభంగా జరపడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే భద్రత, సౌకర్యం కోసం ఆటోహోల్డ్, ఫాల్ సేఫ్, కీలెస్ ఇగ్నిషన్, కీలెస్ బూట్ రిలీజ్, హిల్-హోల్డ్ అసిస్ట్, బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ అలర్ట్‌ల వంటి సదుపాయాలను అందించారు.

Ather Konarc Electric Scooter Launched in India Price Range and Features and Delivery Details Here

ఏథర్ కోనార్క్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను 'ఎస్-లైన్', 'జెడ్-లైన్' అనే రెండు ప్రధాన సిరీస్‌లలో మొత్తం 6 వేరియంట్లలో తీసుకొచ్చారు. ఎస్-లైన్ సిరీస్‌లోని 100 కిలోమీటర్ల రేంజ్ బేస్ వేరియంట్ ధర రూ.99,999 కాగా.. 125 కిలోమీటర్ల రేంజ్ మోడల్ ధర రూ.1,21, 999.. 161 కిలోమీటర్ల రేంజ్ టాప్ మోడల్ ధర రూ.1,44,999గా ఉంది. మిగిలిన మోడళ్ల ధరలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.

డెలివరీల విషయానికొస్తే.. ఎస్-లైన్‌లోని 125 కిలోమీటర్లు, 161 కిలోమీటర్ల మోడళ్ల డెలివరీలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ వేరియంట్ డెలివరీలు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మొదలవుతాయి. గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్ వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రానుండగా.. జెడ్-లైన్ వేరియంట్లు 2027 రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి రానున్నాయి.

రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!
రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!

సాంకేతిక వివరాలను పరిశీలిస్తే.. ఎంట్రీ లెవెల్ వేరియంట్‌లో 2.1KWH, మిడ్-స్పెక్ మోడల్‌లో 2.7KWH, టాప్ వేరియంట్‌లో 3.5KWH బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు. ఎస్-లైన్ మోడల్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అదే విధంగా జెడ్-లైన్ వేరియంట్ గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవడమే కాకుండా 161 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

డిజైన్, డిజిటల్ ఫీచర్లలో ఏథర్ కనెక్టెట్ టెక్నాలజీ, దొంగతనం, టోయింగ్ హెచ్చరికలు, ఫైండ్ మై స్కూటర్, ఆన్-ది-ఎయిర్ అప్‌డేట్లు ఉన్నాయి. సీటు కింద విశాలమైన 31 లీటర్ల స్టోరేజ్ స్పేస్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను అందించారు. టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా వాయిస్ కంట్రోల్స్, ఫుల్ నావిగేషన్, రోడ్డు గుంతలు, ప్రమాద హెచ్చరికల సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+