ఎస్‌యూవీ లాంటి పవర్.. హైటెక్ ఫీచర్లు! భారత మార్కెట్లోకి పవర్‌ఫుల్ బైక్!

సూపర్ బైక్ ప్రియుల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కావాసాకి తన పవర్‌ఫుల్ స్ట్రీట్‌ఫైటర్ బైక్ Z1100 అప్‌డేటెడ్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ లేదా ధరలో ఎటువంటి పెద్ద మార్పులు చేయలేదు. ఈ బైక్ మునుపటి లాగే రూ.12.79 లక్షల(ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తోది. దీనిని కంపెనీ సింగిల్ కలర్ ఆప్షన్ 'ఎబోనీ/మెటాలిక్ కార్బన్ గ్రే'లో అందుబాటులోకి తెచ్చింది.

రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!
రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!

ఈ Z1100 పవర్‌ఫుల్ బైక్‌లో 1,099 సీసీ ఇన్‌లైన్ -ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 136hp పవర్, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా భారత మార్కెట్లో విక్రయించే కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో ఈ స్థాయి పవర్ కనిపిస్తుంది. ఇదే ఇంజిన్‌ను కంపెనీ అడ్వెంచర్ బైక్ Versys 1100లో కూడా ఉపయోగిస్తోంది. అక్కడ ఇది 135hp పవర్, 112Nm టార్క్ ఇస్తుంది. ట్యూబులర్ డైమండ్ ఫ్రేమ్‌పై నిర్మించిన ఈ 220 కేజీల బైక్‌లో లాంగ్ రైడ్స్ కోసం 17 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు.

Kawasaki Z1100 Updated Model Launched in India at Rs 12 79 Lakh with 136hp Power and Hi-Tech Features

రైడింగ్ కంట్రోల్, సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఫ్రంట్ వైపు 120 mm ట్రావెల్‌తో 41 mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 136mm ట్రావెల్‌తో బ్యాక్-లింకేజ్ మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో రెండు 310 mm బ్రెంబో డిస్క్ బ్రేకులు, వెనుక వైపు 260 mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

భారత్‌లోకి కొత్త లగ్జరీ కార్ బ్రాండ్.. ఈ కార్లు వస్తే రచ్చే!
భారత్‌లోకి కొత్త లగ్జరీ కార్ బ్రాండ్.. ఈ కార్లు వస్తే రచ్చే!

హైటెక్ ఫీచర్ల పరంగా ఇందులో 5-ఇంచ్ టీఎఫ్టీ డిస్‌ప్లే, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, 3-లెవెల్ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ బైక్ హోండా సీబీ1000 హార్నెట్ ఎస్పీ(ధర రూ.13.29 లక్షలు)కి గట్టి పోటీని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+