ఈవీ + పెట్రోల్ క్రేజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1100 కిలోమీటర్లు.. క్యూ కడుతున్న కస్టమర్లు!

ఎంజీ మోటార్ కంపెనీ తీసుకొచ్చిన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ 'ఎంజీ హెక్టర్ టోమాహాక్' మార్కెట్లో భారీ డిమాండ్‌ను సంపాదించుకుంది. ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ అయిన ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లలో అందుబాటులో ఉంది. లాంచ్ అయిన స్వల్ప కాలంలోనే దీన బుకింగ్స్ 10 వేల మార్కును దాటడం ఎంజీ మోటార్ సంస్థకు ఓ కీలక మైలురాయిగా నిలిచింది.

రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!
రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!

జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ లక్ష్మీ రామ్ కుమార్ సుబ్బారాజ్ మాట్లాడుతూ.. ఈ కారుకు టైర్-1, టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాల నుంచి సమానంగా బుకింగ్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఇది ఇండియాలోని మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. అయితే కారు డెలివరీకి ఎంత సమయం పడుతుందనే వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ సమాచారం ప్రకారం.. ఈ కారుపై ప్రస్తుతం దాదాపు 8 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఎంజీ సంస్థ ఈ కారును తమ ప్రత్యేక 'అడాప్ట్' ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించింది. ఇది ఓ మల్టీ న్యూ ఎనర్జీ వెహికల్ ఆర్కిటెక్చర్.

MG Hector Tomahawk PHEV and EV Hits 10k Bookings in India Check out the 1100 km Range Price Details

ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించిన ఎంజీ హెక్టర్ టోమాహాక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఈవీ వెర్షన్ విషయానికి వస్తే.. ఇందులో 69.2Kwh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీతో కారు ఒకసారి పూర్తి ఛార్జింగ్‌పై 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో 20.5 Kwh బ్యాటరీ లభిస్తుంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 Kwh బ్యాటరీని జత చేశారు. ఫుల్ ట్యాంక్ పెట్రోల్, ఫుల్ ఛార్జ్ బ్యాటరీతో ఈ కారు ఏకంగా 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా కేవలం ఈవీ మోడ్‌లోనే కారు 115 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

పెట్రోల్ కార్లకు ఇక నో ఎంట్రీ? టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!
పెట్రోల్ కార్లకు ఇక నో ఎంట్రీ? టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

కారును రోజూ క్రమం తప్పకుండా ఛార్జ్ చేస్తూ ఉపయోగిస్తే.. ఇది లీటరుకు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఒకవేళ సాధారణ హైబ్రిడ్ మోడ్‌లో నడిపితే లీటరుకు 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుంది. ధరల విషయానికి వస్తే.. ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్ ద్వారా దీని ప్రారంభ ధర రూ.13.99 లక్షలకే లభిస్తుంది. ఇక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.25.69 లక్షలు కాగా.. దీని ప్రారంభ ధర రూ.21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+