వైసీపీలో మజ్జి సిరి స్థానాన్ని భర్తీ చేసిన యంగ్ టర్క్

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణిని పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసింది. గతంలో మేయర్ అభ్యర్థి రేసులో ఉన్న మజ్జి సిరి ఇటీవల పార్టీకి రాజీనామా చేసి, అధికార తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఈ మార్పు అనివార్యమైంది. స్థానిక రాజకీయంలో పార్టీ స్థానాన్ని బలపరచుకోవడంలో భాగంగా వైసీపీ నాయకత్వం వేగంగా స్పందించింది. శ్రావణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

కుటుంబ వారసత్వం..

కోలగట్ల శ్రావణి విజయనగరం మాజీ ఎమ్మెల్యే, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె. ఆమెకు సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటమే కాకుండా, స్థానిక నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. తండ్రి రాజకీయ వారసురాలిగా విస్తృత పరిచయాలు కలిగి ఉండటం, క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా కేడర్‌తో బలమైన సత్సంబంధాలు ఉండటం శ్రావణి అభ్యర్థిత్వానికి ప్రధానంగా కలసివచ్చే అంశాలని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

Big Political Move in Vizianagaram as Kolagatla Sravani Steps In for Majji Siri who joined in TDP

మజ్జి సిరి షాక్ నుంచి..

మేయర్ స్థానానికి బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మజ్జి సిరి.. తన తండ్రి మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వైసీపీ ఎదురుదెబ్బగా భావించారు మొదట్లో. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. విజయనగరంలో వైసీపీ పట్టు కోల్పోతుందనే అంచనాలు వెలువడ్డాయి. మజ్జి శ్రీను గానీ, మజ్జి సిరి గానీ వైసీపీలో కొనసాగుతున్న సమయంలోనే వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున క్యాడర్ ను సృష్టించుకున్నారని, వాళ్లంతా కూడా టీడీపీకి మళ్లుతారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

మజ్జి సిరి భర్త అవుట్: జగన్ దిద్దుబాటు- రాత్రికి రాత్రి ఉత్తర్వులు
మజ్జి సిరి భర్త అవుట్: జగన్ దిద్దుబాటు- రాత్రికి రాత్రి ఉత్తర్వులు

కోలగట్లకే ప్రాధాన్యత..

ఆ రాజకీయ ప్రతికూల ప్రభావాన్ని నివారించడంలో భాగంగా కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారు.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నగర పాలక సంస్థ పరిధిలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు, పార్టీకి నమ్మకమైన నాయకత్వాన్ని ముందుంచడం ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు సడలకుండా చూసుకోవచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా కోలగట్ల శ్రావణిని మేయర్ అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!
ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ..

రాజకీయంగా మజ్జి కుటుంబానికి ఏ మాత్రం తీసిపోని బలం ఉంది కోలగట్లకు. 1989 నుంచే కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు కోలగట్ల వీరభద్రస్వామి. 2004లో మొదటిసారిగా విజయనగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. 2019లో వైసీపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడాయన వారసురాలిగా శ్రావణి.. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

రసవత్తరంగా విజయనగరం..

ఆమె అభ్యర్థిత్వం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీని మరింత బలపరిచేందుకు ఐక్యంగా పనిచేస్తామని చెబుతున్నారు. కోలగట్ల శ్రావణిని మేయర్ రేసులో దించడం ద్వారా స్థానిక రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రణాళికతో ముందడుగు వేసింది. ఫలితంగా విజయనగరం నగర పాలక సంస్థ వేదికగా రాజకీయం వేడెక్కనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+