PF రూ.1800 మాత్రమే కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త కార్మిక చట్టాల వల్ల సామాన్య ఉద్యోగికి చేతికి వచ్చే జీతం తగ్గిపోతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ, కంపెనీలు తమ శాలరీ స్ట్రక్చర్‌ను తెలివిగా రీ-డిజైన్ చేస్తే, అటు కంపెనీకి ఖర్చు పెరగకుండా, ఇటు ఉద్యోగికి నష్టం జరగకుండా జాగ్రత్త పడవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం.. మీ జీతంలో అలవెన్సులు (HRA, బోనస్ వంటివి) 50% మించకూడదు. ఒకవేళ మించితే, ఆ అదనపు మొత్తాన్ని కూడా 'వేతనం'గానే భావించి పీఎఫ్ కోత విధిస్తారు. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కొత్త రూల్స్ వచ్చినా పీఎఫ్ కంట్రిబ్యూషన్ నెలకు రూ. 1,800 (అంటే రూ. 15,000 బేసిక్ పేపై 12%) వద్దే పరిమితం చేసే వెసులుబాటు ఇంకా ఉంది. యాజమాన్యం, ఉద్యోగి ఇద్దరూ పరస్పరం అంగీకరిస్తే, మీ జీతం ఎంత ఉన్నా సరే.. పీఎఫ్ కోతను కనీస స్థాయిలోనే ఉంచవచ్చు. దీనివల్ల మీ చేతికి వచ్చే నగదు (Take-home salary) తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే, ఎక్కువ పీఎఫ్ కట్ అయితే భవిష్యత్తులో అది మీకు పెద్ద మొత్తంలో పొదుపుగా మారుతుందనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు.

New Labor Code PF Rules How to Maintain RS 1800 PF Limit and Increase Your In-Hand Salary Effortlessly

ట్యాక్స్ సేవింగ్ అలవెన్సుల మ్యాజిక్..

మీ జీతంలో పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు ఇప్పుడు కొత్త దారులను వెతుకుతున్నాయి. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)తో పాటు ఫుడ్ కూపన్లు, ఫ్యూయల్ రీయింబర్స్‌మెంట్లు, కారు లీజు, మొబైల్/గ్యాడ్జెట్ లీజు వంటి అంశాలను శాలరీ స్ట్రక్చర్‌లో చేర్చడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి మీ చేతికి వచ్చే నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి.

ఎన్పీఎస్ (NPS) తో అదనపు లాభం..

కేవలం పీఎఫ్ మాత్రమే కాకుండా, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి పథకాల్లో యజమాని వాటాను చేర్చడం ద్వారా కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మీ రిటైర్మెంట్ ప్లానింగ్‌కు తోడ్పడటమే కాకుండా, శాలరీ బేస్‌ను అనవసరంగా పెంచకుండా కాపాడుతుంది. కంపెనీలు కేవలం జీతం ఇవ్వడమే కాకుండా, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి.

కొత్త కార్మిక చట్టాలు అంటే మీ బేసిక్ పే కచ్చితంగా 50% ఉండాలని రూలేమీ లేదు. చట్టానికి లోబడి తెలివైన మార్పులు చేసుకుంటే, అటు రిటైర్మెంట్ కోసం పొదుపు పెరుగుతుంది, ఇటు చేతికందే జీతం కూడా తగ్గదు. కాబట్టి, మీ కంపెనీ హెచ్ఆర్ (HR) విభాగంతో మాట్లాడి మీ జీతాల స్ట్రక్చర్‌ను పన్నుకు అనుకూలంగా (Tax-efficient) మార్చుకోవడమే ఇప్పుడు మీరు చేయాల్సిన పని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+