నేను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది: ఇంద్రానూయి వ్యాఖ్య

న్యూయార్క్: తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి చమత్కరించారు. మీరు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కేబినెట్లో జాయిన్ కావొచ్చుగా అని ప్రశ్నించగా ఆమె స్పందించారు. నేను రాజకీయాల్లోకా, నేను వస్తే మూడో ప్రపంచయుద్ధం వస్తుందని నవ్వుతూ చెప్పారు.

ఆసియా ఖండం గురించి ప్రపంచ దేశాల్లో చైతన్యం కలిగించే ఓ సంస్థ ఇంద్రానూయికి గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని అందించింది. ఈ సంస్థ న్యూయార్క్‌లో నిర్వహించిన వేడుకకు ఆమె హాజరై, పురస్కారాన్ని అందుకున్నారు.

 Will cause third World War if I join politics: Indra Nooyi

వ్యాపారంలో అసాధారణ లక్ష్యాలు చేరుకోవడం సహా మహిళల్లో చైతన్యం కలిగించడం వంటి ఇతర కార్యక్రమాలు చేపట్టినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.

పెప్సికో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ట్రంప్‌ మంత్రివర్గంలో పనిచేయొచ్చు కదా..? అని అడగ్గా, 'నేనా.. నేను రాజకీయాలకు సరిపడను. నేను మరీ దాపరికం లేకుండా మాట్లాడుతాను. దౌత్యపరంగా ఎలా వ్యవహరించాలో తెలియదు. అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది' అన్నారు.

నేను సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొనేటప్పుడు చాలా కష్టంగా అనిపించిందని, గత నలభై ఏళ్లుగా ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి రోజంతా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల పాటు ఉత్సాహంగా పని చేసేదానిని అన్నారు. ఆమె పెప్సికో సీఈవోగా 12 ఏళ్లపాటు పని చేసి రిటైర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+