అందంగా ఉన్న అత్త మీద కన్ను, పడక సుఖం ఇవ్వలేదని స్పాట్ లో చంపేసిన అల్లుడు!
చెన్నై: సొంత అత్త మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. స్నేహితుడితో కలిసి నిత్యం పోర్న్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేశారు. పోర్న్ వీడియోలకు బానిసలు అయిన యువకులు ఓ మహిళతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నారు. ఇంట్లో మా అత్త ఒంటరిగా ఉంటుందని, ఆమె అందంగా ఉంటుందని, నువ్వు కూడా నాతో వస్తే ఇద్దరూ ఎంజాయ్ చేద్దామని ఓ కామాంధుడు అతని ఫ్రెండ్ ను కూడా పిలుచుకుని అత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది.
చెన్నైలోని కొడుంకయ్యూరు కృష్ణమూర్తి నగర్ లోని కన్నన్ వీధిలో అన్బు (60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అన్బు అతని భార్య వేలంకన్ని (55, కుమారుడు లాజర్, కుమార్తె లాన్సీతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అన్బు ముత్తమిళ్‌లోని ఓ ఐరన్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అన్బు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో అన్బు కుమారుడు లారెన్స్ ఇంటికి వచ్చి చూడగా అతని తల్లి వేలంకన్ని తలకు బలమైన గాయాలతో మృతి చెంది ఉండడంతో దిగ్భ్రాంతికి గురై కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వెంటనే కొడుంకైయూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కొడుంకయ్యూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వేలంకన్ని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా వేలంకన్ని ఇంటికి ఇద్దరు యువకులు వచ్చి వెళ్లినట్లు తేలింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను వేలంకన్ని భర్త, కుమారుడికి చూపించి విచారణ చేపట్టాడరు
వేలంకన్ని ఇంటికి వెళ్లిన యువకుల్లో వేలంకన్ని అన్న కొడుకు అగస్టిన్ అరుణ్ కూడా ఉన్నాడని తేలింది. దీంతో నిన్న రాత్రి అగస్టిన్ అరుణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో, అగస్టిన్ అరుణ్, అతని స్నేహితుడు సోలమన్ ఇద్దరూ కొడుంకైయూర్‌లోని అగస్టిన్ అరుణ్ అత్త వేలంకన్ని ఇంటికి వెళ్లామని పోలీసుల విచారణలో అంగీకరించారు.

ఆ సమయంలో వేలంకన్ని ఒంటరిగా ఉండటాన్ని ఆమె అల్లుడు అరుణ్ అవకాశంగా తీసుకున్నాడు. అరుణ్ అత్త అని కూడా చూడకుండా ఆమె భుజం మీద, ఆమె శరీరంలోని ఇతర భాగాల మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించి మా కోరిక తీర్చాలని ఆమెతో దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నం చేశాడని వెలుగు చూసింది.
దీంతో దిగ్భ్రాంతికి గురైన వేలంకన్ని అరుణ్ ను తిట్టి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే ఈ విషయం మీ ఇంట్లో చెబుతాను అని గట్టిగా అరిచింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన అరుణ్ వేలంకన్ని జుట్టు పట్టుకుని నేలపై పలుమార్లు కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్‌ను కూడా తీసుకెళ్లి వేలంకన్ని మెడపై పొడిచాడు. తరువాత రాడ్ తో వెలంకన్ని తల మీద దాడి చెయ్యడంతో రక్తపుమడుగులో పడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
అనంతరం అరుణ్ అతని స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయారు. విచారణలో బయటపడిన దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు రావడంతో కృష్ణమూర్తి నగర్‌కు చెందిన అగస్టిన్ అరుణ్ (21), న్బనన్ సాలోమన్ (22)లను కొడుంకయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఇద్దరి సెల్‌ఫోన్లను పోలీసులు సోదా చేయగా అసభ్యకరమైన ఫోటోలు, సెక్స్ వీడియోలు లభించాయి.

ఓ మహిళతో సెక్స్ చేయాలనే ఉద్దేశంతో మహిళలకు సంబంధించిన సెక్స్ వీడియోలను వీక్షించినట్లు పోలీసులు విచారణలో గుర్తించామని పోలీసులు అన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు హంతకులపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కామం తీర్చుకోవడానికి సొంత అత్త మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడం, ఆమె ఎదురు తిరగడంతో ఆమెను స్పాట్ లో అల్లుడు చంపేయడం చెన్నై సిటీలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications