నందిని Vs అమూల్, సిద్దూ సీఎంగా ఉన్న టైమ్ లోనే అమూల్ ఎంట్రీ ఇచ్చింది, ఆ రోజు?

బెంగళూరు/చెనై: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మొదలైన నందిని VS అమూల్ వివాదం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కర్ణాటకలో అమూల్ సంస్థ ఉత్పత్తులు విక్రయాలు నిర్వహించడానికి బీజేపీ ప్రభుత్వం సహకరించలేదని, అది సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలోనే అమూల్ సంస్థ వాటి ఉత్పత్తులు కర్ణాటకలో విక్రయించడం మొదలుపెట్టిందని అణ్ణామలై అంటున్నారు.

తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ఐపీఎస్అధికారి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పార్టీ పరిశీలకుడు అయిన అణ్ణామలై చేసిన ట్విట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2017లో అమూలో తన 43వ సర్వసభ్య సమావేశంలో ఉత్తర కర్ణాటకతో పాటు దేశంలోని వివిద రాష్ట్రాల్లో ఆ సంస్థ ఉత్పత్తులు విక్రయించాలని డిసైడ్ అయ్యిందని అణ్ణామలై గుర్తు చేశారు.

 Amul started sales in Karnataka when Siddaramaiah was CM, says Annamalai

అదే ఏడాది అమూల్ తన ఉత్పత్తులను కర్ణాటకలో విక్రయించడం మొదలుపెట్టిందని అణ్ణామలై అంటున్నారు. ఆ సందర్బంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరు ?, సిద్దరామయ్య కాదా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ అణ్ణామలై ట్విట్ చేశారు. ఆ సందర్బంలో సీఎంగా ఉన్న సిద్దరామయ్య కర్ణాటకలో అమూల్ ఉత్పత్తులు విక్రయాలు జరగకుండా ఎందుకు అడ్డుకోలేదని అణ్ణామలై సిద్దరామయ్యను ప్రశ్నించారు.

కర్ణాటకలో సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో నందిని పాలు ప్రతిరోజు 66. 3 లక్షల లీటర్లు విక్రయించారని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిరోజు నందిని పాలు 82.4 లక్షల లీటర్లు విక్రయించారని, నందినిని ఎవరు ప్రోత్సహించారు అనే విషయం ఈ లెక్కలు చూస్తే తెలుస్తాయని అణ్ణామలై అంటున్నారు.

కర్ణాటకలో నందిని పాలు, తమిళనాడులో ఆవిన్ పాలు రెండు రాష్ట్రాలకు రెండు కళ్లులాంటివని, కావాలనే అమూల్ విషయంలో సిద్దరామయ్య అండ్ కో రాద్దాంతం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఐపీఎస్ అధికారి అణ్ణామలై మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+