Illegal affair: ప్రియురాలి ఆత్మహత్య, ప్రియుడిని చంపేసిన ఆంటీ కొడుకులు, ముందే భర్తతో విడాకులు !
చెన్నై/ మదురై/దిండుగల్: భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకులు ఉన్న సమయంలో దంపతులు విడాకులు తీసుకుని వేరు వేరుగా నివాసం ఉంటున్నారు. భర్తను వదిలేసి వేరుగా నివాసం ఉంటున్న మహిళ ఆమె పని చేస్తున్న చోట పని చేసే మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియురాలు, ప్రియుడు పక్కపక్క వీధుల్లోనే ఉండటంతో నిత్యం ఇద్దరూ టచ్ లో ఉన్నారు. కొడుకులు బయటకు వెళ్లి పోవడం, భర్త లేకపోవడంతో ఆ మహిళ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అంతకు ముందే వివాహం చేసుకుని భార్య, పిల్లలు ఉన్నా ప్రియుడు ఎక్కువ సమయం ప్రియురాలి ఇంటిలోనే కాలం గడిపేశాడు. రాత్రి ప్రియురాలు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. ప్రియురాలి ఆత్మహత్యకు ఆమె ప్రియుడే కారణం అని మహిళ కొడుకులు, ఆమె బంధువులు రగిలిపోయారు. ప్రియురాలి కొడుకులు, బంధువులు కలిసి ప్రియుడిని దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది. ఒకే రోజు ప్రియురాలు, ప్రియుడు పైలోకాలకు వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భర్తతో విడాకులు తీసుకున్న ఆంటీ
తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పళని తాలుకా, కలయంబదూర్ సమీపంలోని సమతుపురంలో విక్టోరియా (41) అనే మహిళ నివాసం ఉంటున్నది. భర్త రాజేష్ తో కాపురం చేసిన విక్టోరియా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకులు ఉన్న సమయంలో విక్టోరియా, రాజేష్ దంపతులు విడాకులు తీసుకుని వేరు వేరుగా నివాసం ఉంటున్నారు.

పక్కింటిలో ప్రియుడు..... ఒకే చోట ఉద్యోగం
విక్టోరియా నివాసం ఉంటున్న మూడు నాలుగు ఇళ్ల పక్కలో పద్మనాభన్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పద్మనాభన్ కు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పద్మనాభన్, విక్టోరియా పాపంపట్టి ప్రాంతంలోని పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే చోట నివాసం ఉండటం, ఒకే చోట ఉద్యోగం చేస్తున్న విక్టోరియా, పద్మనాభన్ దగ్గర అయ్యారు.

ఎంజాయ్ చేసిన ఆంటీ
భర్త రాజేష్ ను వదిలేసి వేరుగా ఉంటున్న విక్టోరియా ఆమె పని చేస్తున్న చోట ఉద్యోగం చేస్తున్న పద్మనాభన్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. విక్టోరియాకు, పద్మనాభన్ కు వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది. అయినా ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ప్రియురాలు విక్టోరియా, ప్రియుడు పద్మనాభన్ పక్కపక్క ఇళ్లలో నివాసం ఉండటంతో నిత్యం ఇద్దరూ టచ్ లో ఉన్నారు. కొడుకులు బయటకు వెళ్లి పోవడం, భర్త లేకపోవడంతో విక్టోరియా ఆంటీ ప్రియుడు పద్మనాభన్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

ఆత్మహత్య చేసుకున్న విక్టోరియా
అంతకు ముందే వివాహం చేసుకున్న పద్మనాభన్ భార్య, పిల్లలు ఉన్నా ఎక్కువ సమయం ప్రియురాలు విక్టోరియా ఇంటిలోనే కాలం గడిపేశాడు. నిన్న రాత్రి ప్రియురాలు విక్టోరియా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. ప్రియురాలు విక్టోరియా ఆత్మహత్యకు ఆమె ప్రియుడు పద్మనాభన్ కారణం అని, అతను టార్చర్ పెట్టడం వలనే విక్టోరియా ఆత్మహత్య చేసుకుందని ఆమె కొడుకులు, ఆమె బంధువులు రగిలిపోయారు.

ప్రియుడి దారుణ హత్య
విక్టోరియా ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే విక్టోరియా కొడుకులు, బంధువులు కలిసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న పద్మనాభన్ ను కత్తులతో పొడిచి చంపేశారు. విక్టోరియా శవాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లి పోలీసులు అదే వీధిలో నివాసం ఉంటున్న పద్మనాభన్ హత్యకు గురైనాడని తెలుసుకుని షాక్ అయ్యారు. ప్రియురాలు విక్టోరియా కొడుకులు, బంధువులు కలిసి ప్రియుడు పద్మనాభన్ ను కత్తులతో పొడిచి చంపేయడం కలకలం రేపింది. ఒకే రోజు ప్రియురాలు విక్టోరియా, ఆమె ప్రియుడు పద్మనాభన్ పైలోకాలకు వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications