Illegal affair: అంగన్ వాడి మేడమ్, పెళ్లి, పిల్లలు, నదీ తీరంలో, ఉట్టికి స్వర్గానికి మధ్యలో, పాపం !

చెన్నై/ తిరుపతి/ క్రిష్ణగిరి: వివాహం అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. భర్త సక్రమంగా ఇంటికి రాకపోయినా భార్య సర్దుకుని కాపురం చేసింది. అయితే అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భర్త ఓ అంగన్ వాడి మేడమ్ ఉచ్చులో పూర్తిగా చిక్కుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలితో కలిసి జీవించాలని డిసైడ్ అయ్యాడు. ప్రియురాలితో ఉండటానికి భర్తకు భార్య అడ్డుపడింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త ప్రియురాలితో కలిసి నదీ ఒడ్డున ఎంజాయ్ చేసి పురుగుల మందు తాగేసి ఇప్పుడు ఆసుపత్రిలో ఉట్టికి స్వర్గానికి మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారు.

అంగన్ వాడి టీచర్

అంగన్ వాడి టీచర్

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని ఉతంగరై ప్రాంతంలో కుళ్ళమ్మాల్ అనే మహిళ నివాసం ఉంటున్నది. కుళ్ళమ్మాల్ అంగన్ వాడి టీచర్ గా పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఆది పుత్తూరు ప్రాంతానికి చెందిన పళని ఉత్తంగరై ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పళనికి ఇంతకు ముందే కృష్ణమ్మ అనే మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 మేడమ్ మోజులో పడిన పళని

మేడమ్ మోజులో పడిన పళని

కుళ్ళమ్మాల్, పళనికి పరిచయం ఉంది. పళని, కుళ్ళమ్మాల్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంటికి సక్రమంగా వెళ్లకుండా ఎక్కువ సమయం పళని ప్రియురాలు కుళ్ళమ్మాల్ తో గడపడం మొదలుపెట్టాడు. కుళ్ళమ్మాల్ తో తన భర్త పళని తిరుగుతున్నాడని అతని భార్య కృష్ణమ్మకు తెలిసిపోయింది.

భార్య సర్దుకుంటే రెచ్చిపోయాడు

భార్య సర్దుకుంటే రెచ్చిపోయాడు

పళని అక్రమ సంబంధం గురించి తెలిసినా కృష్ణమ్మ భర్తను పెద్దగా ఏమీ అనలేదు. ఇదే సమయంలో పళని మరింతరెచ్చిపోయాడు. రానురాను ఇంటికి ఏదో ఒక సమయంలో వెళ్లి వస్తూ ప్రియురాలు కుళ్లమ్మాల్ కు పూర్తిగా దాసోహం అయిపోయాడు. నా ఖర్మ ఇంతే అంటూ పళని భార్య కృష్ణమ్మ సర్దుకుని వెలుతోంది.

 నదీ ఒడ్డులో విషం తాగేసి !

నదీ ఒడ్డులో విషం తాగేసి !


రెండు రోజులుగా భర్త పళని ఇంటికి రాకపోవడంతో కృష్ణమ్మ బంధువులకు సమాచారం ఇచ్చింది. బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో పళని కోసం అతని మొబైల్ నెంబర్ ఆధారం పోలీసులు ఆరాతీశారు. ఇదే సమయంలో హనుమాన్ తీర్థ సమీపంలో పళని మొబైల్ నెంబర్ ట్రేస్ అయ్యింది. పోలీసులు హనుమాన్ తీర్థ నదీ ఒడ్డు సమీపంలోకి వెళ్లి చూడగా షాక్ అయ్యారు.

Recommended Video

    Delhi Nurse Approached India Cricketer For IPL Inside Information | Oneindia Telugu
     ఉట్టికి స్వర్గానికి మధ్యలో ప్రేమికులు

    ఉట్టికి స్వర్గానికి మధ్యలో ప్రేమికులు

    నదీ ఒడ్డులో విషం సేవించి మతిస్థిమితం కోల్పోయిన పళని, కుళ్ళమ్మాల్ ను పోలీసులు ఉతంగరై ఆసుపత్రికి తరలించారు. పళని, కుళ్ళమ్మాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని వేర్వేరు అంబులెన్స్ లో క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహం జరిగి పిల్లలు ఉన్నా అక్రమ సంబంధం కారణంగా విషం సేవించిన పళని, కుళ్ళమ్మాల్ పరిస్థితి విషమంగా ఉందని, వారు ఇప్పుడు ఉట్టికి స్వర్గానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+