Revenge: ప్రియురాలు దూరం, ఆంటీ మీద పగ, మహిళా పారిశ్రామికవేత్తపై ప్రతీకారం. మార్ఫింగ్ ఫోటోలు !

చెన్నై: కాలేజ్ లో తనతోపాటు చదువుతున్న సాటి విద్యార్థిని తనతో ఎంతో చనువుగా ఉందని ఆ అబ్బాయి సంతోషపడ్డాడు. ప్రతిరోజు కాలేజ్ లో అమ్మాయి, అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నారు. కాలేజ్ లోని సాటి స్నేహితురాలిని ఆ అబ్బాయి విపరీతంగా ప్రేమించాడు. కరోనా వైరస్ (COVID-19) పుణ్యమా అంటూ లాక్ డౌన్ విధించడం, కాలేజ్ మూసివేయడంతో తన ప్రియురాలిని చూడలేక అబ్బాయి విరహంతో ఆవేదన చెందాడు. లాక్ డౌన్ సందర్బంగా అమ్మాయిని కలవడానికి, కనీసం ఫోన్ లో మాట్లాడటానికి ఆ అబ్బాయికి అవకాశం చిక్కలేదు. తనతో తన ప్రియురాలు మాట్లాడటానికి ఆమె తల్లి అడ్డు పడుతోందని ప్రియుడు రగిలిపోయాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ప్రియురాలి తల్లి మీద పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ప్రారంభించి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో కలకలం రేపింది.

మహిళా పారిశ్రామికవేత్త కుమార్తె

మహిళా పారిశ్రామికవేత్త కుమార్తె

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైసిటీలో శ్రీమంతులు నివాసం ఉండే అశోక్ నగర్ ప్రాంతంలో 40 ఏళ్ల మహిళా పారిశ్రామికవేత్త నివాసం ఉంటున్నారు. ఈమె 17 ఏళ్ల కుమార్తె చెన్నై సిటీలోని ప్రముఖ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం (ఫ్లస్ టూ) చదువుతోంది. చెన్నైలోని తౌజండ్స్ లైట్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అబ్బాయి అదే కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు, మహిళా పారిశ్రామికవేత్త కుమార్తె, అబ్బాయి స్నేహితులు.

 కాలేజ్ లో లవ్ స్టోరి

కాలేజ్ లో లవ్ స్టోరి

మహిళా పారిశ్రామివేత్త కుమార్తె తనతో కలిసి కాలేజ్ లో చదువుతున్న అబ్బాయితో చాలా చనువుగా ఉండేది. ఇద్దరు కలిసి క్యాంటిన్, సినిమాలు, షికార్లకు వెళ్లేవారని తెలిసింది. గత మార్చి నెల వరకు ఇద్దరు కలిసి కాలేజ్ లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకునే వాళ్లు. తనతోపాటు ఉంటున్న అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడు.

పుణ్యం మూటకట్టుకున్న కరోనా

పుణ్యం మూటకట్టుకున్న కరోనా

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు చెయ్యడంతో కాలేజ్ మూసివేయడంతో అమ్మాయి, అబ్బాయి దూరం అయ్యారు. ఇదే సమయంలో అమ్మాయిని కలవడానికి అబ్బాయి చాలా ప్రతయ్నాలు చేశాడు. చెన్నైలో కరోనా వైరస్ వ్యాధి తాండవం చెయ్యడంతో లాక్ డౌన్ మళ్లీ పొడగించడంతో అమ్మాయి, అబ్బాయి కలుసుకోవడం సాధ్యం కాలేదు.

నా లవ్ స్టోరీలో ఆంటీ విలన్

నా లవ్ స్టోరీలో ఆంటీ విలన్

రెండు నెలల ముందు కాలేజ్ అమ్మాయికి ఫోన్ చేసిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్పాడు. నేను నిన్ను ఫ్రెండ్ గా మాత్రమే చూశానని, నేను నిన్ను ప్రేమించలేదని, ఐ హేట్ యూ అంటూ అమ్మాయి చావు కబులురు చల్లగా చెప్పింది. తనతో ఇంతకాలం ఎంతో చనువుగా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ప్రేమించలేదని చెప్పడంతో అబ్బాయి షాక్ కు గురైనాడు. ఇంట్లో ఉంటున్న తన ప్రియురాలు ఆమె తల్లి కారణంగా ఇలా మాట్లాడిందని, నా జీవితంలో ఆంటీ విలన్ అయ్యిందని కాలేజ్ అబ్బాయి రగిలిపోయాడు.

ఫోన్ లో రొమాన్స్, రాసలలీల డైలాగ్ లు

ఫోన్ లో రొమాన్స్, రాసలలీల డైలాగ్ లు

కొంతకాలం నుంచి మహిళా పారిశ్రామికవేత్తకు ఫోన్ చేస్తున్న ఆమె కుమార్తె స్నేహితుడు అసభ్యంగా మాట్లాడటం, రొమాన్స్, రాసలీలల డైలాగులు చెప్పడంతో ఆమె షాక్ కు గురైనారు. ఏదో రాంగ్ నెంబర్ అని ఆమె కొన్నిసార్లు పట్టించుకోలేదు. చివరికి పదేపదే అలాంటి ఫోన్లు రావడంతో ఆమె అసహనంతో రగిలిపోయింది. ఇదే సమయంలో మీ ఫోటోలు, మీ శరీర అందం, వంపులు, చుట్టుకొలతలు చాలా బాగున్నాయని, ఆ ఫోటోలు నేను సోషల్ మీడియాలో చూశానని ఆ యువకుడు స్నేహితురాలి తల్లితో అసభ్యంగా మాట్లాడాడు.

మార్ఫింగ్ ఫోటోల దూమరం

మార్ఫింగ్ ఫోటోల దూమరం

ఇన్స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో తన మార్ఫింగ్ ఫోటోలు చూసిన మహిళా పారిశ్రామికవేత్త షాక్ కు గురైనారు. ఎవరో తన పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేస్తున్నారని, గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ లో అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నాడని మహిళా పారిశ్రామికవేత్త చెన్నై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

    #WATCH Man Marries Both Lover and Bride Chosen by His Family Same Time Viral, Bizarre! || Oneindia
    ఆంటీ మీద పగతో చేశాను

    ఆంటీ మీద పగతో చేశాను

    చెన్నై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలోని నకిలీ ఐపీ అడ్రస్ ల ఆధారంగా విచారణ చేశారు. అదే సమయంలో చెన్నైలోని తౌజండ్స్ లైట్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడు మహిళా పారిశ్రామికవేత్త ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేశారు. తన ప్రియురాలు దూరం కావడానికి ఆమె తల్లి (ఆంటీ) కారణం అయ్యారని, అందుకే పగతో ఇలా చేశానని ఆ కాలేజ్ అబ్బాయి నేరం అంగీకరించాడు. మైనర్ బాలుడిపై మూడు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి బాలుడిని అరెస్టు చేసి జువనైల్ జైలుకు పంపించామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+