Lovers: రెండు నెలల క్రితం పెళ్లి, ఇంట్లో ఏకాంతంగా ఉంటే ఇద్దరిని నరికి చంపిన అమ్మాయి తండ్రి, దెబ్బకు!

చెన్నై/ తుత్తుకుడి: దగ్గర బంధువులు అయిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మేనమామ కూతురిని ప్రేమించిన యువకుడు ఆమెతో సంతోషంగా తిరిగాడు. ప్రేమికుల వయసులో తేడా ఉంది. ప్రియుడు సక్రమంగా స్నేహితులతో ఎక్కువగా తిరుగుతున్నాడని అమ్మాయి తండ్రి వాళ్ల పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశాడు. తండ్రి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రియురాలు మాత్రం బావను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.

పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆమె బావతో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకుంది. 2 నెలలు బయట కాపురం చేసిన ప్రేమికులు తరువాత సొంత ఊరికి వెళ్లారు. ఇంట్లో సంతోషంగా ఉన్న సమయంలో అమ్మాయి తండ్రి కొడవలితో వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. కన్న కూతురు, ఆమె భర్తను నరికి చంపేసిన కిరాతకుడు దర్జాగా బయటకు వెళ్లిపోయాడు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయి

డిగ్రీ కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని కోవిల్ పట్టి సమీపంలోని వీరపట్టి గ్రామంలో ముత్తుకుట్టి (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముత్తుకుట్టి కుమార్తె రేష్మా (19) కోవిల్ పట్టిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. రేష్మా ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

బావతో లవ్ లో పడిన కాలేజ్ అమ్మాయి

బావతో లవ్ లో పడిన కాలేజ్ అమ్మాయి

రేష్మా మేనమామ కుమారుడు మాణిక్యరాజ్ (28) అదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మేనమామ కుమార్తె రేష్మాతో మాణిక్యరాజ్ లవ్ లో పడ్డాడు. దగ్గర బంధువులు అయిన రేష్మా, మాణిక్యరాజ్ ప్రేమించుకున్నారు. మేనమామ కూతురు రేష్మా ప్రేమించిన మాణిక్యరాజ్ ఆమెతో సంతోషంగా తిరిగాడు. రేష్మా, మాణిక్యరాజ్ ప్రేమించుకుంటున్న విషయం ఇరు వైపుల కుటుంబ సభ్యులకు తెలుసు.

పెళ్లికి అమ్మాయి తండ్రి అభ్యంతరం

పెళ్లికి అమ్మాయి తండ్రి అభ్యంతరం

ప్రేమికులు రేష్మా, మాణిక్యరాజ్ వయసులో 9 సంవత్సరాల తేడా ఉంది. మాణిక్యరాజ్ గతంలో వేరే రాష్ట్రంలో పని చేసేవాడు. రెండు సంవత్సరాల క్రితం సొంత ఊరికి వెళ్లిపోయి సక్రమంగా పని చెయ్యకుండా అతని స్నేహితులతో ఎక్కువగా తిరుగుతున్నాడు. ఇదే విషయంలో రేష్మా, మాణిక్యరాజ్ పెళ్లికి అమ్మాయి తండ్రి ముత్తుకుట్టి అభ్యంతరం వ్యక్తం చేశాడు.

భయంతో రెండు నెలలు బయట కాపురం

భయంతో రెండు నెలలు బయట కాపురం

రేష్మా పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఆమె బావ మాణిక్యరాజ్ తో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకుంది. 2 నెలల పాటు రేష్మా, మాణిక్యరాజ్ తుత్తుకూడిలో అద్దె ఇంటిలో కాపురం చేశారు. నెల రోజుల పాటు రేష్మా కోసం ఆమె కుటుంబ సభ్యులు గాలించి తరువాత సైలెంట్ అయిపోయారు. పెద్దలు మా పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోలేదని అనుకున్న రేష్మా, మాణిక్యరాజ్ ఇటీవల వాళ్ల సొంత ఊరికి వెళ్లారు.

కూతురు, అల్లుడిని ఒకేసారి నరికి చంపేశాడు

కూతురు, అల్లుడిని ఒకేసారి నరికి చంపేశాడు

రేష్మా, మాణిక్యరాజ్ ఇంట్లో సంతోషంగా ఉన్న సమయంలో అమ్మాయి తండ్రి ముత్తుకుట్టి కొడవలితో వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. కన్న కూతురు రేష్మా, ఆమె భర్త మాిక్యరాజ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా డోర్ లాక్ చేసిన ముత్తుకుట్టి ఇద్దరిని వేటకొడవలితో దారుణంగా స్పాట్ లో నరికి చంపేసి దర్జాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. వివాహం చేసుకున్న రెండు నెలలకే రేష్మా, మాణిక్యరాజ్ ఒకేసారి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+