రజనీకాంత్ సేన వలసల బాట .. డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతలపై తలైవా టీమ్ చెప్పిందిదే !!
సూపర్ స్టార్ రజనీకాంత్ తన అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పడంతో రజనీకాంత్ మక్కల్ మండ్రం కు చెందిన పలువురు సభ్యులు రాజీనామా చేసి వలసల బాట పట్టారు.ఇక ఈ విషయంపై స్పందించిన మక్కల్ మండ్రం పెద్దలు తమ సభ్యులు ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి ఇతర పార్టీలలో చేరేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని ఒక ప్రకటనలో తెలిపారు.

డీఎంకే లో చేరిన మక్కల్ మండ్రం నేతలు .. దీనిపై రజనీ టీమ్ స్పందన ఇదే
రజనీకాంత్ మక్కల్ మండ్రం కు చెందిన మూడు జిల్లాల కార్యదర్శులు ఆదివారం డిఎంకెలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు . ఇదే సమయంలో త్వరలో మరి కొంతమంది రజినీకాంత్ మక్కల్ మండ్రం నుండి బయటకు రానున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ మక్కల్ మండ్రం ఇతర పార్టీ లో చేరడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని, ఏ పార్టీలో చేరినప్పటికీ వారంతా రజిని అభిమానులేనని గుర్తుంచుకోవాలని రజనీకాంత్ మక్కల్ మండ్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.

రాజకీయాల్లోకి రానని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చిన రజనీకాంత్
మరో రెండు నెలలలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారని భావించిన , పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలలో తమిళనాడు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తారని భావించిన రజనీకాంత్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి రానని ప్రకటించడం, అందుకు తన అనారోగ్యాన్ని కారణంగా చెప్పడం తెలిసిందే. రజనీకాంత్ చేసిన ఈ ప్రకటన ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా, రజనీకాంత్ పార్టీ పెడతారని ఎంతగానో ఆశగా ఎదురుచూసిన మక్కల్ మండ్రం సభ్యులకు కూడా పెద్ద షాక్ అని చెప్పాలి.

ఎన్నికల సమయంలో వలసల బాట పట్టిన మక్కల్ మండ్రం నేతలు
ఆ తర్వాత రజనీకాంత్ తన నిర్ణయం మార్చుకోవాలని అభిమానులు ఆందోళనలు కొనసాగించినా ఆయన తన నిర్ణయం మారదని తేల్చి చెప్పడంతో రజనీకాంత్ తో రాజకీయ ప్రయాణం సాగించాలని ఆశతో ఉన్న ఆయన అభిమాన సంఘం నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు.
వలసల బాట పట్టిన మక్కల్ మండ్రం నేతలు ఇప్పటికే పలువురు డిఎంకేలో చేరి తమ రాజకీయ మద్దతు డీఎంకే కే అని తేల్చి చెప్పారు. అంతేకాదు రజనీకాంత్ మక్కల్ మండ్రం పెద్దలకు చెప్పే వచ్చామని వారు స్పష్టం చేశారు.

ఇప్పటికే పలువురు డీఎంకేలోకి జంప్ .. రజనీ మద్దతు కోసం రాజకీయ పార్టీల నిరీక్షణ
తూత్తుకుడి జిల్లా మక్కల్ మండ్రం కార్యదర్శి జోసెఫ్ స్టాలిన్, తేని కార్యదర్శి గణేషన్, రామనాథపురం కార్యదర్శి సెంథిల్ సెల్వానంద్ స్టాలిన్ సమక్షంలో డిఎంకెలో చేరారు. అంతకుముందు క్రిష్ణగిరి కార్యదర్శి మది అలగన్ కూడా డీఎంకేలో చేరి స్టాలిన్ కు మద్దతును ప్రకటించారు. మరోపక్క రాజకీయాల్లోకి రానని ప్రకటించిన రజినీకాంత్ ప్రకటిస్తారని బిజెపి భావించింది. మరోవైపు కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం కోసం రజనీకాంత్ మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రజినీకాంత్ మక్కల్ మండ్రం సభ్యులు ఒక్కొక్కరుగా డీఎంకే బాట పట్టడం ఆసక్తికర పరిణామం.












Click it and Unblock the Notifications