Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రజనీకాంత్ కు సర్జరీ .. కోలుకుంటున్న తలైవా.. త్వరలో డిశ్చార్జ్ చేస్తామన్న కావేరీ ఆస్పత్రి వైద్యులు

ప్రముఖ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో రజనీకాంత్ చేరడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుండి వచ్చిన రజినీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించారు.

రజనీకాంత్ కు సర్జరీ నిర్వహించిన కావేరి ఆస్పత్రి వైద్యులు

రజనీకాంత్ కు సర్జరీ నిర్వహించిన కావేరి ఆస్పత్రి వైద్యులు

కావేరి ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, వైద్యుల బృందం రజనీకాంత్‌ను పరీక్షించింది . దక్షిణ-భారత సూపర్‌స్టార్‌కు కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ప్రక్రియ తర్వాత నటుడు బాగా కోలుకుంటున్నాడని కొన్ని రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక రజనీకాంత్ కు అసలు ఏమైంది ఆపరేషన్ ఎందుకు చేశారు అని చాలా మంది భావిస్తున్నారు. రజనీకాంత్ కు కరోటిడ్ ధమనిలో బ్లాక్ సమస్య తలెత్తడంతో ఆయనకు సర్జరీ అనివార్యమైందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజుల తర్వాత ఆయనను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు.

 రజనీకాంత్ కు తల మెదడుకు రక్తం చేరవేసే ధమనిలో బ్లాక్ .. తొలగించిన వైద్యులు

రజనీకాంత్ కు తల మెదడుకు రక్తం చేరవేసే ధమనిలో బ్లాక్ .. తొలగించిన వైద్యులు


కరోటిడ్ ఆర్టరీ తల మరియు మెడకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. ధమనుల యొక్క లైనింగ్‌లలో కొవ్వు పదార్ధాల నిర్మాణం కరోటిడ్‌ను తగ్గించి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. 70 ఏళ్ల నటుడు రజనీకాంత్ కు కూడా కరోటిడ్ ఆర్టరీలో కొవ్వు చేరుకోవడం వల్ల బ్లాక్ ఏర్పడింది. కావేరి ఆసుపత్రి వైద్యులు, ఈ ధమనిలోని బ్లాక్‌ను తొలగించి, తదుపరి సమస్యలను రాకుండా నివారించటానికి ఆపరేషన్ నిర్వహించారు. గురువారం,రజనీకాంత్ ఆరోగ్యం పై వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో రజనీకాంత్ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో ఉన్నారని, ఆయన ఒక రోజు ఆసుపత్రిలో, పరిశీలనలో ఉండవలసి ఉంటుందని చెప్పారు.

తాజాగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్న రజనీకాంత్

తాజాగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్న రజనీకాంత్

గత 45 ఏళ్లుగా భారతీయ సినిమాకు చేసిన అద్భుతమైన సేవలకుగాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడానికి రజనీకాంత్ ఈ వారం ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం, నటుడు భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రితో తన సమావేశాల చిత్రాలను ట్వీట్ చేశారు. గురువారం అతను తన రాబోయే చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శనను తన కుటుంబంతో కలిసి వీక్షించిన సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా పంచుకున్నాడు. ఆ తర్వాత సడన్ గా ఆసుపత్రిలో చేరారు.

ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన వద్దన్న రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్

ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన వద్దన్న రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్


ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని రజనీకాంత్ భార్య లత రజినీకాంత్ పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తన 168వ చిత్రం 'అన్నాత్తే' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నిర్మాణ సమయంలో కూడా రజనీకాంత్ అనేకమార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు తెగ ఆందోళన పడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+