Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Romance: జైలు వార్డెన్లు, ఒకడు వల వేస్తే ఇంకొకడు వీడియోలు తీశారు, అర్దరాత్రి సెంట్రల్ జైల్లో ? అబ్బా!

చెన్నై/సేలం: సెంట్రల్ జైలు దగ్గర భద్రత ఎలా ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు పగలు, రాత్రి గస్తీ తిరుగుతూ ఉంటారు. ఎప్పటిలాగే రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు సెంట్రల్ జైలు వైపు వెళ్లారు. ఆ సందర్బంలో ఓ యువతి సెంట్రల్ జైలు సమీపంలో నిలబడి ఉంది.

అర్దరాత్రి అవుతున్న సమయంలో నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. యువతి చెప్పిన సమాధానంతో పోలీసులు హడలిపోయారు. మరుసటి రోజు సెంట్రల్ జైలు వార్డెన్లు ఇద్దరు అరెస్టు కావడం కలకలం రేపింది.

సెంట్రల్ జైలు దగ్గర రాత్రి 11 గంటలకు?

సెంట్రల్ జైలు దగ్గర రాత్రి 11 గంటలకు?

తమిళనాడలోని సేలంలోని అలఘపురం ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో సేలం సెంట్రల్ జైలు ముందు నిలబడి ఉంది. ఆ మార్గంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సేలం సిటీ పోలీసులు అటువైపు వెళ్లారు. సెంట్రల్ జైలు సమీపంలో అంతరాత్రి పూట యువతి ఒక్కటే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు యువతి దగ్గరకు వెళ్లి ఇంతరాత్రి పూట ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించారు.

నా బాయ్ ఫ్రెండ్స్ లోపల ఉన్నారు

నా బాయ్ ఫ్రెండ్స్ లోపల ఉన్నారు

జైలులో పనిచేస్తున్న ఓ వార్డెన్‌ తో తాను ప్రేమలో ఉన్నానని, అతని కోసం ఎదురు చూస్తున్నానని ఆ యువతి గస్తీ తిరుగుతున్న పోలీసులకు చెప్పింది. పోలీసులు యువతిని గట్టిగా ప్రశ్నించడంతో ఆమె అసలు మ్యాటర్ బయటకు చెప్పింది. సేలం సెంట్రల్ జైల్లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు వార్డెన్‌లు తన అసభ్యకర చిత్రాలు చిత్రీకరించారని, వాటిని అడ్డం పెట్టుకుని వారి కోరిక తీర్చాలని ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తున్నారని ఆ యువతి చెప్పడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు హడలిపోయారు.

అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

దీంతో షాక్‌కు గురైన సేలం పోలీసులు యువతిని క్షేమంగా ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఉదయం అస్తంపట్టి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇద్దరు వార్డెన్ ల మీద ఫిర్యాదు చెయ్యాలని యువతికి సూచించారు. ఉదయం యువతి అస్తంపట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇద్దరు వార్డెన్ల మీద ఫిర్యాదు చేసింది.

ఆరు నెలల క్రితం సేలం జైలు ముందు నిల్చున్నప్పుడు ఓ వార్డెన్‌తో తనకు పరిచయం అయ్యిందని, తరువాత ఇద్దరూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల ద్వారా నిత్యం టచ్ లో ఉన్నామని యువతి పోలీసులకు చెప్పింది.

ఇద్దరూ ఎంజాయ్ చేసి వీడియోలు తీశారు

ఇద్దరూ ఎంజాయ్ చేసి వీడియోలు తీశారు

సెంట్రల్ జైలు వార్డెన్ ఒక్కసారి అతని ఇంటికి తనను పిలుచుకుని వెళ్లాడని యువతి పోలీసులకు చెప్పింది. ఆ సందర్బంలో తనతో వార్డెన్ రొమాన్స్ చేస్తున్న సమయంలో మరో వార్డెన్ అతని ఇంటికి వచ్చాడని, తరువాత తాను వార్డెన్ తో సరసాలు ఆడుతున్న వీడియోలు సీక్రేట్ గా తీశాడని యువతి చెప్పింది. ఆ వీడియోలు తనకు చూపించిన మరో వార్డెన్ నన్ను బెదిరించి దురుసుగా ప్రవర్తించి అస్యంగా ప్రవర్తించి తన మీద అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు చెప్పింది.

వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి?

వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి?

తనతో ఇద్దరు వార్డెన్లు ఎంజాయ్ చేస్తుున్న సమయంలో ఒకరి తరువాత ఒకరు వీడియోలు తీశారని, ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని తనను ఎప్పుడంటే అప్పుడు రమ్మని చెప్పి వారి కోరికలు తీర్చుకుంటున్నారని యువతి సేలం పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. తనను నిత్యం బెదిరిస్తూ వారి కోరికలు తీర్చాలని చెబుతున్నారని, రాత్రి 11 గంటలకు వారి కోరిక తీర్చడానికి సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లానని యువతి పోలీసులకు చెప్పింది.

దెబ్బకు మైండ్ బ్లాక్

దెబ్బకు మైండ్ బ్లాక్

నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి వారి మొబైల్ ఫోన్లలో ఉన్న తన అసభ్యకర వీడియోలను డిలీట్ చెయ్యాలని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అస్తంపట్టి పోలీసులు సేలం సెంట్రల్ జైలులో పనిచేస్తున్న జైలు వార్డెన్లు అరుణ్, శివశంకర్ ల మీద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. 20 ఏళ్ల యువతి జీవితంతో ఆడుకున్న ఇద్దరినీ సెంట్రల్ జైలుకు పంపించడానికి సేలం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+