చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌ -ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్

|
Google Oneindia TeluguNews

తన సినిమాల్లోనే కాదు, వీలు చిక్కిన ప్రతిసారి కేంద్రంలోని మోదీ సర్కారు తీరును ఎండగట్టేందుకు వెనుకాడరు తమిళ నటుడు విజయ్. గతంలో కేంద్ర సంస్థలకు టార్గెటైనా తలపతి తన తీరును మార్చుకోలేదు. తాజాగా పోలింగ్ స్టేషన్ కు ఆయన సైకిల్ పై రావడం ద్వారానూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది..

షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీషాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీ

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం నాడు ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచే రాష్ట్రమంతటా పోలింగ్ స్టేషన్ల వద్ద సందడి నెలకొంది. చెన్నై సహా పలు నగరాల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తొలి గంటల్లోనే ఓటేశారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది.

viral video: Actor Vijay cycles to polling station in Chennai, police lathicharge frenzied fans

చెన్నై సిటీలోని నీలాంకరైలో గల ఓ పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌ సైకిల్‌పై వచ్చారు. క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ అభిమాన నటుడు సైకిల్‌పై కన్పించడంతో ఆశ్చర్యపోయిన అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా,

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

viral video: Actor Vijay cycles to polling station in Chennai, police lathicharge frenzied fans

కొవిడ్ నిబంధనల నేపథ్యంలో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. విజయ్ పోలింగ్ స్టేషన్ కు వచ్చిన సమయంలో అభిమానులు గుమ్మికూడటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగానే విజయ్‌ సైకిల్‌పై వచ్చినట్లు ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఓటేసిన తర్వాత విజయ్ తన ఫ్యాన్స్ తో కలిసి బైక్ పై తిరిగెళ్లిపోయారు.

English summary
Actor Vijay on Tuesday came to the voting booth in a bicycle to cast his vote as Tamil Nadu went to polls. Wearing a green t-shirt with a face mask, Vijay was seen cycling on a red and black coloured bicycle to the booth on Tuesday morning to cast his vote in a polling booth located in Neelankarai, Chennai. Visuals of his cycling trip to the polling booth went viral on social media in no time. Tamil superstar Vijay comes to the polling station riding a cycle and conveying a strong message to the voters on petrol prices
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X