Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు సోదరి ఇంటికీ పోలీసులు- సోదాలకు యత్నం- పొరబాటంటూ వివరణ

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న తరుణంలో ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడి పోలీసులు కేసు నమోదు చేసి వివరణ ఇవ్వాలని కోరగా.. ఇప్పుడు ఆయన సోదరి ఇంట్లోనూ పోలీసులు అక్రమంగా చొరబడటం కలకలం రేపుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారి పల్లెలో చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ మండిపడుతోంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు సోదరి ఇంట్లోకి పోలీసులు

చంద్రబాబు సోదరి ఇంట్లోకి పోలీసులు

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు సోదరి కె.హైమావతి నివాసం ఉంటున్నారు. మంగళవారం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన తరుణంలో అదే రోజు సాయంత్రం ఆమె ఇంట్లో లేని సమయంలో పోలీసులమంటూ వచ్చి కొందరు సోదాలు నిర్వహించారు. కాపలా సిబ్బంది చెప్పినా వినకుండా ఆమె నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసలే హైదరాబాద్‌కు వెళ్లి మరీ చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియక హైమావతి ఇంట్లో పనివాళ్లు కూడా కాసేపు గందరగోళానికి గురయ్యారు.

 సీసీ కెమెరాలు చూసి వెనక్కి

సీసీ కెమెరాలు చూసి వెనక్కి

హైమావతి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులమంటూ వచ్చిన వారికి సీసీ కెమెరాలు కనిపించాయి. కాసేపు ఏం చేయాలో తెలియలేదు. దీంతో వారు నివాసం లోపలికి వెళ్లకుండా వెనక్కి తగ్గారు. ఇల్లు పరిసరాల్లో ఫొటోలు తీసుకున్నారు. గార్డెన్‌, ఎంట్రన్స్‌ సహా పలు ఫొటోలు తీసుకున్నారు. చివరికి ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. జరిగిన వ్యవహారంపై హైమావతి ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది ఆమెకు ఫిర్యాదు చేశారు. అప్పుడు బయట ఉన్న హైమావతి తర్వాత ఇంటికొచ్చాక దీనిపై ఆరా తీసినట్లు తెలిసింది.

పోలీసుల తీరుపై చంద్రగిరిలో ఫిర్యాదు

పోలీసుల తీరుపై చంద్రగిరిలో ఫిర్యాదు

చంద్రబాబు సోదరి హైమావతి ఇంట్లోకి ప్రవేశించడం, అక్కడ ఫొటోలు తీసుకోవడంపై టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. కాపలా సిబ్బంది వారిస్తున్నా ఇంట్లోకి ప్రవేశించి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంపై చంద్రగిరి టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరికి కాపలాదారు రవి పోలీసుల తీరుపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఫిర్యాదు చేశారు. ఎలాంటి వారెంట్‌ లేకుండా ఇంట్లోకి ప్రవేశించడం, సోదాల పేరుతో చేసిన హంగామాపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

పొరబాటున నారావారిపల్లెకు బదులు కందులవారిపల్లెకు..

పొరబాటున నారావారిపల్లెకు బదులు కందులవారిపల్లెకు..


చంద్రబాబు సోదరి హైమావతి ఇంట్లో నిర్వహించిన సోదాలపై చంద్రగిరి పోలీసులు ఆ తర్వాత మీడియా ప్రశ్నిస్తే వివరణ ఇచ్చారు. ఇదే మండలంలోని నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత అనే మహిళ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని, అయితే పోలీసులు నారావారిపల్లెకు బదులుగా కందులవారి పల్లెకు వెళ్లారని సీఐ వివరణ ఇచ్చారు. చంద్రబాబు సోదరి హైమావతి కూతురు పేరు కూడా సుచరిత కావడంతో పొరబాటున అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. దీంతో వివాదం కొంత సద్దుమణిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+