తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుష్.. బుష్: వాషింగ్ మిషన్‌లో నాగరాజు.. ఎగిరి గంతేసిన వివాహిత

|
Google Oneindia TeluguNews

పాము.. పేరు చెబితే గజ గజ వణికిపోతారు. ఎవరో కొందరు డేర్ చేస్తారు. కానీ చాలా మంది భయపడుతుంటారు. ఇక నాగుపాము గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాము ఇక్కడ ఉంటే.. మూడు గజాల దూరం పరుగు తీస్తారు. చాలా సందర్భాల్లో ఇళ్లలోకి పాములు వస్తుంటాయి. సజ్జల మీద కూడా కనిపిస్తాయి. అయితే వాషింగ్ మిషన్‌లో నాగు పాము కనిపించింది. దీంతో సదరు మహిళ ఎగిరి గంతేసింది. వామ్మో.. పాము.. పాము అంటు పరుగుతీసింది.

భయం.. భయం...

భయం.. భయం...

పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదా. పామును చాలా దగ్గరగా అంటే.. అలవాటుగా ఇంటి పనులు చేస్తున్న సమయంలో.. సరాసరి అది మీద దూకే పరిస్థితే ఉంటే.. వామ్మో!.. తలుచుకుంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి కదా. కానీ అలాంటి సిచుయేషన్ ఓ మహిళ ఎదుర్కొంది.

వాషింగ్ మిషన్..

వాషింగ్ మిషన్..

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంట్లోని వాషింగ్ మెషీన్‌లో దూరిన ఓ నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేద్దామని దాని డోర్‌ తెరవగా.. అక్కడే తిష్ట వేసిన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ వర్మకు సమాచారం ఇచ్చారు. అతడొచ్చిచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బతుకుజీవుడా..

బతుకుజీవుడా..

ఆ మహిళ అదృష్టం బాగుందని నెటిజన్లు అంటున్నారు. పొరపాటున పాము కాటు వేసి ఉంటే, ఆమె పరిస్థితి ఏమై ఉండేదోనని అంటున్నారు. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, సరాసరి వాషింగ్ మెషీన్‌లోకి దూరింది. ఆ విషయం తెలియని మహిళ.. వెంటనే తీసివేసింది. పామును చూసి వెంటనే డోర్ వేసింది. పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చి.. అప్పటివరకు అలానే వెయిట్ చేశారు. వెంటనే అతను వచ్చి.. నాగుపామును పట్టడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ క్షణం తమకు గుండెల్లో గుబులు రేకెత్తించిందని వారు అంటున్నారు.

English summary
cobra in washing machine. a women feared and close the door. incident happened in east godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X