ఎన్నికల ప్రకటనకు జాప్యం వద్దు .. వెంటనే నిర్వహించండి : ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ లేఖ
ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాలంటూ పట్టుబట్టిన అధికార వైసిపి, ఇప్పుడు ఎన్నికలను కరోనా నేపథ్యంలో పోస్ట్ పోన్ చేయాలని భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఉన్న వివాదాల కారణంగా ప్రభుత్వం ఇప్పట్లో ఎన్నికలకు వెళ్ళటం మంచిది కాదని అభిప్రాయపడుతుంది .

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రగడ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం రగడ కొనసాగుతోంది.
కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదంటూ సీఎస్ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాయడం , దానిపై నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటి అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై లేఖ రాసిన రఘురామ
ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమిషన్ ను కోరారు . దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిందని, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video

స్కూల్స్ కు ఓకే కానీ ఎన్నికలకు కాదా ? రఘురామ ప్రశ్న
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన రఘురామ రాష్ట్రంలో ఇసుక విధానం దోపిడీకి తెరలేపినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు మాన్సస్ ట్రస్ట్ విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ట్రస్టు ఆస్తుల పరిరక్షణ బాధ్యతను అశోక్ గజపతిరాజుకు అప్పగించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల నిర్వహణకు ఎలాంటి జాప్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా రఘురామకృష్ణంరాజు స్కూళ్ళు ప్రారంభించిన ప్రభుత్వం కరోనా పేరు చెప్పి ఎన్నికలు ఎలా వాయిదా వేస్తుంది అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న కారణం సరైనది కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications