తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ-తూ.గో. సరిహద్దుల్లో ఉద్రిక్తత- బాక్సైట్ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో బాక్సైట్ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అక్కడ జరుగుతోందని బాక్సైట్ మైనింగ్ కాదని, లైటరైట్ మాత్రమేనని ప్రభుత్వం చెప్తుండగా.. విపక్షాలు మాత్రం రూ.15 వేల కోట్ల బాక్సైట్ మైనింగే జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనింగ్ ప్రాంతాల పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతల్ని పోలీసులు ఇవాళ అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ-తూ.గో. సరిహద్దుల్లో బాక్సైట్‌ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

police arrest tdp leaders touring bauxite mining sites at visakha-east godavari border

మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబుతో కూడిన బృందాన్ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసుల తీరుపై అయ్యన్న, రాజప్ప, ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను టచ్ చేయొద్దంటూ అయ్యన్న పాత్రుడు పోలీసులపై సీరియస్ అయ్యారు.
పోలీసుల నుంచి కరోనా సోకితే ఎవరు బాధ్యులని అయ్యన్న ప్రశ్నించారు.

police arrest tdp leaders touring bauxite mining sites at visakha-east godavari border

Recommended Video

Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

బాక్సైట్ మైనింగ్ పై వాస్తవాలు తెలుసుకనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ ఆపాలని, బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు.- గిరిజన సంపదను పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వం పైకి బాక్సైట్ మైనింగ్ అనుమతులు రద్దు చేసినట్లు చెప్తున్నా.. అక్కడ యథేచ్చగా తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు మండిపడ్డారు.

English summary
tdp senior leaders chinarajappa, ayyannapatrudu and nakka anandababu were arrested while trying to visiit bauxite mining areas at east godavari-visakhapatnam district borders today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X