ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు ఎన్నికల బ్రేక్ వెనుక ? చివరి నిమిషంలో ఏం జరిగింది ? హైకోర్టు ఆగ్రహానికి కారణాలివే

|
Google Oneindia TeluguNews

ఏలూరులో మున్సిపల్‌ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. పోలింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అభ్యర్ధులు ప్రచారం ముగించేందుకు హడావిడిగా పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో హైకోర్టు నుంచి పిడుగులాంటి వార్త. దీని సారాంశం ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. దీంతో అభ్యర్ధులు, అధికారులు, ఓటర్లు అందరూ ఒక్కసారిగా షాక్. ఏమైందో తెలుసుకునేందుకు ఒకటే ఫోన్లు. చివరికి ఓటర్ల జాబితాలో అక్రమాలను సవరించకపోవడంతో హైకోర్టు ఈ ఎన్నికలను నిలిపేసిందని తేలింది. అయితే గతేడాదే ఏలూరులో ఎన్నికలకు సిద్ధమైన ఎస్‌ఈసీ ఇప్పటీకీ అదే జాబితాతో ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏలూరు కార్పోరేషన్‌ పోరుకు హైకోర్టు బ్రేక్‌

ఏలూరు కార్పోరేషన్‌ పోరుకు హైకోర్టు బ్రేక్‌


ఏలూరు నగర పాలక సంస్ధకు రేపు జరగాల్సిన ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర హైకోర్టు నిన్న నిలిపేసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు వెలువడిన ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికలకు పూర్తి స్ధాయిలో సన్నద్ధమైన రాజకీయ పార్టీలను, అభ్యర్ధులను ఈ నిర్ణయం హతాశుల్ని చేసింది. అదికారులు, సిబ్బంది పడిన కష్టమంతా వృధా అయిపోయింది. అయినా సరే ఎన్నికల వాయిదాకే హైకోర్టు మొగ్గు చూపింది. ఈ విషయంలో అటు ఎస్ఈసీ కానీ, ఇటు ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏమీ చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో వీరంతా ఇప్పుడు నిరాశ పడక తప్పలేదు.

ఏలూరులో అసలేం జరిగింది ?

ఏలూరులో అసలేం జరిగింది ?

ఏలూరు నగర పాలక సంస్ధలో ఎన్నికల నిర్వహణకు వీలుగా గతేడాది కరోనాకు ముందే డివిజన్లను పునర్విభజన చేసి, ఓటర్ల జాబితాను సవరించారు. ఇందులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిపై ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఓటర్ల జాబితాను సవరించాలని, డివిజన్ల పునర్విభజనలో హేతుబద్ధంగా వ్యవహరించాలని హైకోర్టు గతేడాది మార్చి 5నే ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండానే మార్చి 9న ఏలూరులో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చేసింది. దీనికి కారణం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఓటర్ల జాబితాను సవరించినట్లు మున్సిపల్ కమిషనర్‌ ఎస్‌ఈసీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఈసీ యథావిదిగా నోటిఫికేషన్ ఇచ్చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ గతేడాది మార్చి 13నే పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడిపోవడంతో ఈ వ్యవహారం మూలన పడింది. తిరిగి ఈ కేసు తాజాగా విచారణకు రావడంతో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అమలు కాకుండానే ఎన్నికలు జరగడానికి వీల్లేదని వాటికి బ్రేక్‌ వేసేసింది.

 ఎస్ఈసీ, ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఎస్ఈసీ, ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

గత ఏడాది ఓటర్ల జాబితా సవరించి ఏలూరులో ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లడమే కాకుండా ఓసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఎన్నికల సంఘం నిర్ణయాలను ప్రశ్నించలేరంటూ ఎస్ఈసీ వాదించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇదో న్యాయపరమైన సంక్షోభానికి దారి తీసే నిర్ణయమని వ్యాఖ్యానించింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు తర్వాత ఓటర్ల జాబితా సవరణ కోసం ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఒక్క రోజులోనే అమలు చేసినట్లు మున్సిపల్‌ అధికారులు ఎస్ఈసీకి చెప్పడం, ఎస్‌ఈసీ దాన్ని ఆమోదించడం కూడా తప్పని హైకోర్టు తేల్చిచెప్పింది.
సింగిల్‌ బెంచ్‌ను పిటిషన్లు తప్పుదోవ పట్టించారని ప్రభుత్వం చేసిన వాదననూ ఆమోదించలేదు.

 ఏలూరు ఓటర్ల జాబితాలో కుక్కకూ చోటు

ఏలూరు ఓటర్ల జాబితాలో కుక్కకూ చోటు

ఏలూరు నగర పాలక ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు తయారు చేసిన జాబితాలో పలు విచిత్రాలు చోటు చేసుకున్నాయి. వీటిలో పలు చోట్ల ఒక్కో ఓటరు పేరుతో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అలాగే ఓ కుక్కకూ ఓటు ఉన్నట్లు చూపారు. సీరియల్‌ నంబర్ 1615తో కుక్కకు ఓటు ఉన్నట్లు చూపారు. అలాగే దాని ఫొటో కూడా ఉంచారు. అలాగే పలు డివిజన్లలో డోర్‌ నంబర్లు లేకుండాన పలువురికి ఓట్లు ఇచ్చేశారు. ఇంటి నంబరు ఉండాల్సిన చోట ప్లాట్‌ నంబర్‌, ప్లాట్‌ నంబర్ ఉండాల్సిన చోట ఇంటి నంబర్లు, ఇంటి నంబరు స్ధానంలో సున్నాలు ఉంచడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కోర్టుకు సమర్పించిన సవరించిన జాబితాలోనే ఇలాంటి అక్రమాలు కనిపించడంతో హైకోర్టు సీరియస్‌ అయింది. ఎన్నికలు వాయిదా వేయక తప్పని పరిస్ధితి ఉందని తెలిపిన హైకోర్టు చివరికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

English summary
andhra pradesh high court has issued stay order on holding municipal corporation elections with various reasons like revision of divisions, voters list and others also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X