Headphones Side Effects: అదే పనిగా ఇయర్‍ఫోన్స్ వాడుతున్నారా.. అయితే చెవులు పోయినట్లే..
ప్రస్తుత యుగంలో దాదాపు ప్రతీ ఒక్కరి మొబైల్స్ ఉన్నాయి. దాదాపు వాటికి సమానంగా ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్ ఉన్నాయి. దీంతో ప్రతీ ఒక్కరు చెవిలో ఇయర్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకుని సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణం చేస్తున్నప్పుడు వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి వాడడం వల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది. డిజిటల్ సౌండ్ రేంజ్ లో శబ్ధం ఉంటుంది. దీని వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందట.
పిల్లలు
యుక్తవయసు పిల్లలు, యువతీ యువకుల్లో దాదాపు 24% మంది మితిమీరిన వాల్యూమ్‌తోనే సంగీతాన్ని వింటున్నారని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఇటీవల గుర్తించింది. దాదాపు 100 కోట్ల మంది వినికిడి లోపం బారినపడే ప్రమాదముందని హెచ్చరించింది. ఎక్కువ శబ్దంతో ఒకసారి విన్నా, మాటిమాటికి విన్నా చెవుల్లో వినికిడి వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పింది.

ఆరోగ్య సంస్థ గణాంకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సురక్షితంకాని హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వినియోగంపై అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకుల బృందం అధ్యయనం చేపట్టింది. సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్, పిల్లల్లో 75 డీబీ శబ్దం మించకూడదట. చిన్న వయసులో వినికిడి వ్యవస్థ దెబ్బతింటే వయసుతో పాటు తలెత్తే వినికిడి లోపం ముప్పు మరింత ఎక్కువవుతుందట. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువతలో వినికిడి సమస్య పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications