కొంపలను కూలుస్తున్న ఫ్లడ్లైటింగ్ రిలేషన్షిప్.. ఇంతకీ ఈ విష సంస్కృతి ఏమిటి?

మన జీవితంలో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి. అవి మనకు ఆనందాన్ని, భద్రతను, తోడును అందిస్తాయి. అయితే, కొన్నిసార్లు మన ప్రవర్తనలే ఆ బంధాలను బలహీనపరుస్తాయి. అలాంటి ఒక హానికరమైన ప్రవర్తనే "ఫ్లడ్లైటింగ్". ఇంతకీ ఫ్లడ్లైటింగ్ అంటే ఏమిటి? అది సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దాన్ని ఎలా అధిగమించాలి? వివరంగా తెలుసుకుందాం.

ఫ్లడ్లైటింగ్ అంటే ఏమిటి?
ఫ్లడ్లైటింగ్ అనేది మానసిక , భావోద్వేగ పరంగా ఒక వ్యక్తి తన భాగస్వామిని అధిక సమాచారం, విమర్శలు, డిమాండ్లు లేదా భావోద్వేగాలతో ముంచెత్తే పరిస్థితిని సూచిస్తుంది. ఇది తరచుగా వాదనలు లేదా తీవ్రమైన సంభాషణల సమయంలో జరుగుతుంది.

floodlighting-relationships-is-a-toxic-culture-that-is-weakening-bonds

ఊహించుకోండి, హఠాత్తుగా మీ ముఖంపై అత్యంత ప్రకాశవంతమైన ఫ్లడ్లైట్ వేస్తే ఎలా ఉంటుంది? కళ్ళు బైర్లు కమ్మి, ఏమీ చూడలేక, ఏం చేయాలో తోచక, భయంతో బిగుసుకుపోతారు కదా? ఫ్లడ్లైటింగ్ కూడా అలాంటిదే. ఒక భాగస్వామి మాటల దాడితో, భావోద్వేగాల వరదతో రెండో వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు, వారు మానసికంగా "ఫ్లడ్" (మునిగిపోయినట్లు) అయిపోతారు. వారు ఆ సమాచారాన్ని లేదా భావోద్వేగాలను ప్రాసెస్ చేయలేరు, స్పందించలేరు, పూర్తిగా నిస్సహాయంగా మారిపోతారు.

ఫ్లడ్లైటింగ్ లక్షణాలు:
భాగస్వామికి ఆలోచించుకోవడానికి లేదా సమాధానం చెప్పడానికి సమయం ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించడం. తీవ్రమైన విమర్శలు చేయడం, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, నిందించేలా మాట్లాడటం. పాత విషయాలను తవ్వుకొవడం. అంటే ప్రస్తుత సమస్యకు సంబంధం లేని పాత గొడవలను, తప్పులను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడం.అరవడం, గొంతు పెంచడం వంటి చేయడం . ఇది సంభాషణలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ బిగ్గరగా మాట్లాడటం వంటి లక్షణాల కిందకు వస్తుంది.

విపరీతమైన కోపం, ఏడుపు లేదా ఆందోళనను భాగస్వామిపై కుమ్మరించడం వంటి భావోద్వేగాలను అదుపు చేసుకోలేకుండా ప్రవర్తిండం . భాగస్వామిని మాట్లాడనివ్వకపోవడం. వారు చెప్పేది వినకుండా, మధ్యలోనే అడ్డు తగలడం లేదా వారి అభిప్రాయాలను కొట్టిపారేయడం వంటి చేయడం. భాగస్వామికి విరామం కావాలనిపించినా, నిష్క్రమించకుండా ఒత్తిడి చేయడం వంటి లక్షణాలు భాగస్వాముల మధ్య కొనసాగడం వారి బంధాన్ని బలహీనపరుస్తాయి.

ఫ్లడ్లైటింగ్ ఎందుకు జరుగుతుంది?

ఫ్లడ్లైటింగ్ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటి తీవ్రమైన ఆందోళన లేదా భయం. ముఖ్యంగా భాగస్వామి దూరం అవుతారేమోనని ఆందోళన, ఆపోహాలో ఉండటం. చిన్నప్పటి నుండి నేర్చుకున్న అనారోగ్యకరమైన సంభాషణ పద్ధతులు. అంతే కాకుండా తమ మాట ఎవరూ వినడం లేదనే భావనలో ఉహించుకోవడం. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇబ్బందిగా ఉండటం. సమస్యను వెంటనే పరిష్కరించాలనే తీవ్రమైన కోరిక . అది తప్పుడు పద్దితిలోనైనా కావచ్చు.

How Floodlighting Damages Relationships

సంబంధాలపై ప్రభావం:
అయితే ఈ ఫ్లడ్లైటింగ్ సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక్కొసారి భాగస్వామి దూరం అవ్వడం వంటి ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఫ్లడ్ చేయబడిన వ్యక్తి తరచుగా సంభాషణ నుండి మానసికంగా లేదా భౌతికంగా తప్పుకుంటారు. వారు మౌనంగా ఉండిపోవడం, ముఖం తిప్పుకోవడం లేదా గది వదిలి వెళ్లిపోవడం వంటివి చేస్తారు. బంధాల మధ్య నమ్మకం దెబ్బతినడం వంటివి జరుగుతుంటాయి. ఇది నిరంతరం దాడికి గురవుతున్నట్లు భావించడం వల్ల భాగస్వామిపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఒకరిపై ఒకరికి విసుగు, కోపం పెరగడం వంటివి తలెత్తుతాయి. దీని వల్ల ఇద్దరి మధ్య పరిష్కారం కాని సమస్యలు, ప్రతికూల భావోద్వేగాలు పేరుకుపోతాయి.సంభాషణ పూర్తిగా ఆగిపోవడం. దీనివల్ల సమస్యల గురించి ఆరోగ్యకరంగా చర్చించుకునే అవకాశం తగ్గిపోతుంది. అంతే కాకుండా బంధం బలహీనపడిపోతాయి. ఇది కాలక్రమేణా, ఇది బంధాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి కూడా దారితీయవచ్చు.

ఫ్లడ్లైటింగ్ ను ఎలా అధిగమించాలి?

మీరు ఫ్లడ్లైటింగ్ చేస్తున్నారని లేదా దానికి గురవుతున్నారని గుర్తిస్తే, కొన్ని చర్యలు ద్వారా అధిగమించవచ్చు. మొదటగా, ఈ ప్రవర్తన జరుగుతోందని ఇద్దరూ గుర్తించడం ముఖ్యం. సంభాషణ తీవ్రరూపం దాలుస్తోందని, ఎవరో ఒకరు ఫ్లడ్ అవుతున్నారని అనిపించినప్పుడు, వెంటనే విరామం తీసుకోవడానికి అంగీకరించాలి. కనీసం 20 నిమిషాల విరామం తీసుకొని, ఇద్దరూ శాంతపడటానికి ప్రయత్నించాలి. సమస్యల గురించి చర్చించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవడం, ఆ సమయంలో ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి.

Floodlighting

"నువ్వు ఎప్పుడూ ఇంతే" అనడానికి బదులుగా, "నువ్వు అలా మాట్లాడినప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది" వంటి "నేను" వాక్యాలు వాడటం వల్ల ఎదుటి వ్యక్తిపై నింద వేసినట్లు ఉండదు. పాత విషయాలన్నీ లాగకుండా, ప్రస్తుత సమస్యపై మాత్రమే దృష్టి సారించడం. భాగస్వామి చెప్పేది పూర్తిగా విని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడండి. విరామ సమయంలో శ్వాస వ్యాయామాలు, నడక వంటివి చేయడం ద్వారా శాంతపడటానికి ప్రయత్నించాలి. సమస్య తీవ్రంగా ఉంటే, రిలేషన్‌షిప్ కౌన్సిలర్ లేదా థెరపిస్ట్ సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

Take a Poll

ఫ్లడ్లైటింగ్ అనేది తెలియకుండానే సంబంధాలను దెబ్బతీసే ఒక విషపూరిత ప్రవర్తన. దీనిని గుర్తించి, ఆరోగ్యకరమైన సంభాషణ పద్ధతులను అలవరచుకోవడం ద్వారా భాగస్వామితో బంధాన్ని బలపరుచుకోవచ్చు. ప్రశాంతత, పరస్పర గౌరవం, సహానుభూతితో కూడిన సంభాషణలే దృఢమైన, సంతోషకరమైన సంబంధాలకు పునాది వేస్తాయి. మీ బంధంలో ఫ్లడ్లైటింగ్ నీడలు పడకుండా జాగ్రత్త వహించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+