health tips: విపరీతమైన నరాల నొప్పులా? కారణాలివే.. ఉపశమనానికి ఇంటి చిట్కాలివే!!

ఇటీవల కాలంలో టెక్నాలజీతో పాటు పరుగులు తీస్తున్న నేటి తరుణంలో, రోగాలు కూడా అదే స్థాయిలో జనాలని ఇబ్బంది పెడుతున్నాయి. కంప్యూటర్ ముందు పని పెరిగిపోయిన తరుణంలో, మెదడుపై విపరీతమైన భారం పడడంతో తీవ్రమైన నరాల నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడంతో నరాల సమస్యలు ఇప్పుడు జనాలను విపరీతంగా బాధిస్తున్నాయి.

నరాల నొప్పులకు కారణం ఇదే ..

నరాల నొప్పులకు కారణం ఇదే ..

ఇక నరాల నొప్పులు ఎందుకు వస్తాయి? వాటిని తగ్గించుకోవడానికి మార్గాలేమిటి? ఏం చేయడం వల్ల మనం నరాల నొప్పులు నుండి బయటపడవచ్చు వంటి అనేక అంశాలను ప్రస్తుతం తెలుసుకుందాం. సహజంగా నరాల నొప్పి మధుమేహం ఉన్నవారిలో, మందులు ఎక్కువగా వాడుతున్న వారిలో లేదా కీమోథెరపీ నుండి దుష్ప్రభావాల వల్ల, గాయాలు వంటి వైద్య పరిస్థితుల వల్ల సంభవిస్తుంది. మెదడు మరియు వెన్నుపాము సమస్య ఉన్నప్పుడు నరాల నొప్పి విపరీతంగా బాధిస్తుంది. ఇక అదే విధంగా కండరాలు మరియు అవయవాల మధ్య నరాలలో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నరాల నొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఈ లోపం కూడా నరాల నొప్పికి కారణమే

ఈ లోపం కూడా నరాల నొప్పికి కారణమే

కొన్ని రకాల మందులు వాడటం వల్ల శరీరంలో విటమిన్ బి1 విటమిన్ 12 లోపం ఏర్పడినప్పుడు కూడా నరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు నరాలకు రక్త సరఫరా తగ్గినప్పుడు, నరాల ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, నరాల బలహీనత ఉన్నప్పుడు, నరాల నొప్పి సహజంగా వస్తుందని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం తో పాటుగా ఇంటి చిట్కాలు నరాల సమస్యలకు ఎంతో బాగా పని చేస్తాయని చెపుతున్నారు.

నరాల నొప్పులకు గృహ చిట్కాలు

నరాల నొప్పులకు గృహ చిట్కాలు

ఇక నరాల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ఇంట్లో అనుసరించవలసిన చిట్కాలు విషయానికి వస్తే నరాల నొప్పులు ఉన్నవారికి పసుపు సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పసుపును చేర్చుకోవడం, ఇక రాత్రి సమయాల్లో పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో, పసుపు, కొంచెం మిరియాల పొడి కలుపుకొని తీసుకోవడం వల్ల నరాల నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. పసుపులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వల్ల నరాల నొప్పి తగ్గుతుందని, నరాల బలహీనతకు కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందని నేచురోపతి వైద్యులు సూచిస్తున్నారు.

 రాక సాల్ట్ , వావిలాకులతో ఆ పని చెయ్యండి

రాక సాల్ట్ , వావిలాకులతో ఆ పని చెయ్యండి

అంతేకాదు నరాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి స్నానం చేసే నీటిలో రాక్ సాల్ట్ వేసుకొని, వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. రాక్ సాల్ట్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది కండరాలు మరియు నరాలకు అవసరమైన మెగ్నీషియం అందిస్తుందని తద్వారా నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. ఇక నరాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి వావిలాకు ను నీళ్లలో మరగబెట్టి ఆ నీళ్ళతో స్నానం చేస్తే కండరాలు, నరాల నొప్పులు మటుమాయం అవుతాయని సూచిస్తున్నారు.

నరాల నొప్పులను తగ్గించటంలో యాపిల్ సైడర్ వెనిగర్ పాత్ర

నరాల నొప్పులను తగ్గించటంలో యాపిల్ సైడర్ వెనిగర్ పాత్ర

నరాల నొప్పి నుండి ఉపశమనం పొందడం కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ లో క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఉండడంవల్ల ఇది నరాల నొప్పులు తగ్గిస్తుందని సూచిస్తున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి, అందులో ఒక స్పూన్ తేనె కలిపి వారంలో రెండు సార్లు తాగితే నరాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.

శారీరక వ్యాయామం లేకపోతే కూడా నరాల నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, పౌష్టికాహారం తీసుకుంటూ, శారీరక వ్యాయామం చేయడం వల్ల కొంతమేర నరాల నొప్పులు తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+