వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఆరోగ్యం కోసం పంచవర్షప్రణాళిక అవసరం లేదు; ఈ పంచసూత్రాలు పాటిస్తే చాలు!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఎవరు ఏది చెబితే ఆ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. డైటింగ్ ల పేరుతో ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటారు. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

ఆరోగ్య కోసం పంచ సూత్రాలు

ఆరోగ్య కోసం పంచ సూత్రాలు

ఆరోగ్యం కోసం ఎవరు ఏది చెబితే అది చేయకూడదు. ఒక మనిషి శరీరానికి ఇంకొక మనిషి శరీరానికి మధ్య తేడా ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యసమస్యలకు ఇంకొక మనిషి ఆరోగ్యసమస్యలకు మధ్య తేడా ఉంటుంది. ఒకరు పాటించే ఆరోగ్య సూత్రాలు ఇంకొకరికి సరిపోవచ్చు, సరిపడక పోవచ్చు. అయితే అందరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన పంచ సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తే అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లమవుతారు. ఇక ఈ పంచ సూత్రాలు ఏంటి అనే విషయానికి వస్తే

ఆరోగ్యం కోసం రోజూ ఉదయం చెయ్యాల్సింది ఇదే

ఆరోగ్యం కోసం రోజూ ఉదయం చెయ్యాల్సింది ఇదే


ఉదయం నిద్ర లేచిన వెంటనే వ్యాయామం చేయడం... ఆరోగ్యం కోసం చేయవలసిన మొదటి సూత్రం. కచ్చితంగా ఉదయం నిద్ర లేచి, సూర్యునికి ఎదురుగా నిలబడి కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయగలిగిన వారు ఆరోగ్యంగా ఉంటారు. శారీరక శ్రమ బాగా తగ్గిన నేటి రోజుల్లో, ఉదయం నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కండరాలు శక్తివంతమవుతాయి. సూర్యరశ్మి మన శరీరం పై పడటం వల్ల విటమిన్ డి3 మనకు పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవలసిన మొదటి సూత్రం వ్యాయామం.

ఈ సూత్రాన్ని అసలే మరచిపోకండి

ఈ సూత్రాన్ని అసలే మరచిపోకండి

ఇక రెండవ సూత్రం.. శరీరానికి సరిపడా నీటిని తాగడం. చాలామంది మంచినీళ్లు తాగడం మరచిపోతుంటారు. శరీరానికి కావలసినంత నీటిని అందించకపోతే మనిషి అనారోగ్యం పాలు కావడం ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరచిపోకుండా రోజుకు నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు నీటిని తాగాలి. నీళ్లను తాగడం మర్చిపోతే శరీరం డీహైడ్రేట్ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి .కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ నీటిని తాగడం మరచిపోవద్దు.

మయం ప్రకారం, ఒక పద్దతిలో పాటించాల్సిన సూత్రమిదే

మయం ప్రకారం, ఒక పద్దతిలో పాటించాల్సిన సూత్రమిదే

ఇక ఆరోగ్యంకోసం పాటించవలసిన మూడవ సూత్రం పౌష్టిక ఆహారాన్ని తినాలి. జంక్ ఫుడ్స్, ఎక్కువగా నూనె తో తయారు చేసిన ఆహారం తినడం మానుకోవాలి. క్రమబద్ధమైన భోజనాన్ని చెయ్యాలి. సమయం ప్రకారం భుజించాలి. మితాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల రోగాల బారి నుంచి రక్షణ కలుగుతుంది. కాబట్టి తినే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.

ఇది లేకుంటే ఆరోగ్య నాశనం.. కాబట్టి జాగ్రత్త

ఇది లేకుంటే ఆరోగ్య నాశనం.. కాబట్టి జాగ్రత్త

ఇక ఆరోగ్యంకోసం పాటించవలసిన నాలుగవ సూత్రం కంటి నిండా నిద్ర. చాలా మంది అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటారు. మొబైల్ ఫోన్లో తలపెట్టి లేదా టీవీలో సినిమాలు చూస్తూ సరిగ్గా నిద్రపోరు. అటువంటి వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఖచ్చితంగా 8 గంటల సేపు నిద్ర పోవాలి. మధ్యలో నిద్ర భంగాలు లేకుండా ఎవరైతే కంటినిండా నిద్రపోగలుగుతారో వారు ఆరోగ్యంగా ఉంటారని గుర్తుంచుకోవాలి. కాబట్టి కచ్చితంగా నిద్ర విషయంలో జాగ్రత్త వహించాలి.

అన్నిటికన్నా ముఖ్యమైన సూత్రం ఇదే... మర్చిపోకండి

అన్నిటికన్నా ముఖ్యమైన సూత్రం ఇదే... మర్చిపోకండి


ఆరోగ్యం కోసం పాటించవలసిన ఐదవ అతి ముఖ్యమైన సూత్రం. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకూడదు. ఆందోళనను, ఒత్తిడిని దూరం పెట్టాలి. ప్రస్తుత పరుగుల ప్రపంచంలో వృత్తి వ్యాపారాలలోను, ఉద్యోగాలలోనూ విపరీతంగా ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడిని జయించగలిగితే సగం రోగాల నుండి రక్షణ పొందినట్టే. కాబట్టి కచ్చితంగా నిజజీవితంలో మనపై ఉంటున్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఐదు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారు. ఆరోగ్యం కోసం ఎవరు ఏది చెబితే అది ఫాలో కాకుండా వీటిని జీవితంలో భాగం చేసుకోండి. ఈ పంచ సూత్రాలే మీ పంచ ప్రాణాలను రక్షిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Health does not require a big plan. Exercise, drinking enough water, eating nutritious food, getting 8 hours of sleep and being stress-free are all you need to do.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X