"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!

గోధుమ రవ్వ ఉప్మా (Wheat Rava Upma).. దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది సులభంగా తయారవ్వడమే కాకుండా శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారికి ఇది మంచి ఆహారంగా భావిస్తారు. గోధుమ రవ్వలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండటం వల్ల ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.

గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతోనే ఇది రుచికరంగా తయారవుతుంది. ఇందులో కూరగాయలు కలిపితే రుచి పెరగడంతో పాటు పోషక విలువలు కూడా మరింత పెరుగుతాయి. ఉదయం అల్పాహారంగా మాత్రమే కాకుండా సాయంత్రం తేలికపాటి భోజనంగా కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఉప్మా తినడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు చెప్పే విధంగా ట్రై చేస్తే మాత్రాం మొత్తం లాగించేస్తారు. ఈ టేస్టీ రెసిపీ ఈజీగా ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

wheat-ravva-upma-making-recipe-in-telugu-with-easy-steps-and-tips-for-serving-also-best-taste

కావలసిన పదార్థాలు..

గోధుమ రవ్వ - 1 కప్పు

నీళ్లు - 2.5 నుండి 3 కప్పులు ( మెత్తగా రావాలంటే - 3 కప్పులు, పొడిపొడిగా రావాలంటే - 2.5 కప్పులు )

నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - 1 టీ స్పూన్

జీలకర్ర - 1 టీ స్పూన్

మినపప్పు - 1 టీ స్పూన్

శనగపప్పు - 1 టీ స్పూన్

ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)

పచ్చిమిర్చి - 2 నుంచి 3 (చీల్చినవి)

అల్లం ముక్కలు - 1 టీ స్పూన్

క్యారెట్ - 1 చిన్నది (తరిగినది)

పచ్చి బఠానీలు - 2 టేబుల్ స్పూన్లు

కరివేపాకు - కొద్దిగా

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)

నిమ్మరసం - 1 టీ స్పూన్

జీడిపప్పు లేదా పల్లీలు - కొద్దిగా (రుచికి)

తయారీ విధానం..

ముందుగా ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వను స్వల్ప మంటపై దోరగా వేయించాలి. రవ్వ నుండి మంచి వాసన వచ్చేవరకు కలుపుతూ వేయించడం చాలా ముఖ్యం. ఇలా వేయించడం వల్ల ఉప్మా తయారయ్యేటప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా మెత్తగా ఉడుకుతుంది. (వేయించిన రవ్వను ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.)

అదే బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై మినపప్పు, శనగపప్పు వేసి స్వల్పంగా దోరగా వేయించాలి.

తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి తాలింపు మంచి సువాసన వచ్చే వరకు కలపాలి.

ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు బాణలిలో వేసి స్వల్పంగా మగ్గే వరకు వేయించాలి. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వంటి కూరగాయలను కలిపి కొన్ని నిమిషాలు మగ్గనివ్వాలి. (కూరగాయలు కొద్దిగా ఉడికితే ఉప్మాకు మంచి రుచి, రంగు వస్తాయి.)

కూరగాయలు మగ్గిన తర్వాత అవసరమైన పరిమాణంలో నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి నీరు బాగా మరిగే వరకు వేచి ఉండాలి. (నీరు మరుగుతున్నప్పుడు మంటను కొంచెం తగ్గించాలి)

ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను నెమ్మదిగా బాణలిలో పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా సమంగా ఉడుకుతుంది. (ఈ దశలో మంట తక్కువగా ఉంచడం మంచిది.)

రవ్వను కలిపిన తర్వాత బాణలికి మూత పెట్టి తక్కువ మంటపై సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి.

నీరు పూర్తిగా ఆవిరైపోయి రవ్వ మెత్తగా ఉడికినప్పుడు ఉప్మా సిద్ధమవుతుంది.

చివరగా కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి.

బాణలిని స్టవ్ నుండి దించి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉంచితే ఉప్మా మరింత పొడిపొడిగా రుచిగా తయారవుతుంది.

చిట్కాలు..

ఉప్మాను మరింత రుచిగా చేయాలంటే చివర్లో కొద్దిగా నిమ్మరసం కలపవచ్చు. కొంతమంది వేయించిన జీడిపప్పు లేదా పల్లీలు కూడా కలుపుతారు. ఇది ఉప్మాకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అలాగే కొబ్బరి తురుము కొద్దిగా చల్లితే కూడా చాలా బాగుంటుంది.

ఎలా వడ్డించాలి?

గోధుమ రవ్వ ఉప్మాను వేడిగా వడ్డిస్తేనే మంచి రుచి ఉంటుంది. దీనిని అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి లేదా పెరుగు తో తింటే మరింత రుచిగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన, తేలికైన మరియు పోషకవిలువలతో కూడిన అల్పాహారంగా గోధుమ రవ్వ ఉప్మా ప్రతి ఇంట్లో సులభంగా తయారుచేసుకునే వంటకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+