వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: తిన్నా తినకపోయినా నీరసంగా ఉంటుందా? కారణాలివే; చెయ్యాల్సిందిదే!!

|
Google Oneindia TeluguNews

ఎవరు ఆస్తిపరుడు అంటే.. డబ్బున్న వాళ్ళు కాదు.. ఆరోగ్యం ఉన్న వాళ్ళని చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన విషయంలో గొప్ప అర్థం దాగి ఉంది. ఒక మనిషి తను ఏం చేయాలనుకున్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అయిన వారు సునాయాసంగా చేయగలుగుతారు. అయితే ఇప్పుడు సమాజంలో ఆరోగ్యవంతుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏదో ఒక కారణాలతో అనారోగ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

తిన్నా, తినకపోయినా నీరసం.. ఎందుకంటే

తిన్నా, తినకపోయినా నీరసం.. ఎందుకంటే

తింటే ఆయాసం తినకపోతే నీరసం అన్నట్టు చాలామంది పరిస్థితి కనిపిస్తుంది. ఇక తిన్నా, తినకపోయినా నీరసంగా ఉంటున్న వారి సంఖ్య, ఎప్పుడు చూసినా చురుకుగా లేకుండా, అశక్తులుగా కనిపిస్తున్న వారి సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతుంది. తిన్నా తినకపోయినా ఎందుకు నీరసంగా ఉంటుంది? అసలు నీరసానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? నీరసం తగ్గాలంటే ఏం చెయ్యాలి ? వంటి అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాం.

నీరసం వల్ల అన్నింటా వెనుకబాటు.. రోజంతా నిరుత్సాహం

నీరసం వల్ల అన్నింటా వెనుకబాటు.. రోజంతా నిరుత్సాహం

చాలామంది ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే దాకా నీరసంగానే ఉంటారు. ఇక నిద్ర లేచిన తర్వాత కూడా తీవ్రమైన అలసట ఫీలవుతూ ఉంటారు. ఇలా నీరసంగా ఉండటం వల్ల వారు ఏ పనినీ సక్రమంగా చేయలేరు. దైనందిన కార్యక్రమాలలోనే కాకుండా, వృత్తి వ్యాపారాలలోనూ, ఉద్యోగ నిర్వహణలోనూ వారు వెనుకబడి పోయి ఉంటారు. నీరసం, అలసట వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా నీరసంగా ఉంది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఇక అటువంటి వారు నీరసంగా ఎందుకు ఉంటుంది అనే దాని వెనుక ప్రధాన కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

నీరసంగా ఉండటానికి ప్రధాన కారణాలు ఇవే

నీరసంగా ఉండటానికి ప్రధాన కారణాలు ఇవే

నీరసంగా ఉండటం వెనుక ప్రధాన కారణం ఎక్కువగా నీళ్లు తాగకపోవడం. మన శరీరానికి కావలసిన నీళ్లు తాగకపోతే నీరసంగా అనిపిస్తుంది. శరీరానికి తగినన్ని నీళ్లు తాగిన వారిలో కచ్చితంగా నీరసంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతీ రోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి అని సూచిస్తున్నారు. నీళ్ళు మన శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి అని చెబుతున్నారు. ఇక బాగా నీరసంగా ఉండటం వెనుక ఉన్న మరొక కారణం ఉదయం ఏమీ ఆహారం తీసుకోకపోవటం.

ఉదయం కచ్చితంగా ఈ పని చేస్తే నీరసం తగ్గుతుంది

ఉదయం కచ్చితంగా ఈ పని చేస్తే నీరసం తగ్గుతుంది

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అటువంటివారిలో నీరసం ఉంటుందని చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేయడం కన్నా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యమని, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తోనే మనం ఉత్సాహంగా ఆరోజు పనిలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. కాబట్టి మధ్యాహ్నం, రాత్రి చేసే భోజనం కంటే ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనదిగా గుర్తించి, బ్రేక్ ఫాస్ట్ చేస్తే కాస్త నీరసం తగ్గుతుందని సూచిస్తున్నారు.

 నీరసం తగ్గాలంటే పౌష్టికాహారం తీసుకోవటం మస్ట్

నీరసం తగ్గాలంటే పౌష్టికాహారం తీసుకోవటం మస్ట్


ఇక అంతే కాకుండా ఐరన్ లోపం ఉన్న వారిలో కూడా నీరసంగా ఉంటుందని , శరీరంలో ఐరన్ లోపం నివారించే ఆహారాన్ని తీసుకోవాలని, అప్పుడు నీరసాన్ని తగ్గించడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఆకుపచ్చని కూరగాయలను, ఆకు కూరలను తింటే ఐరన్ లోపం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఇక నీరసంగా ఉండటానికి మరొక కారణం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోకపోవడం. చాలామంది శరీరానికి మేలు చేసే పౌష్టికాహారాన్ని వదిలిపెట్టి జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇక అటువంటి వారు జంక్ ఫుడ్స్ వల్ల పోషకాహార లోపానికి గురవుతారని, పోషకాహార లోపం ఉన్న వారిలోనూ నీరసంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి నీరసాన్ని తగ్గించుకోవాలంటే జంక్ ఫుడ్స్ మానేస్తే మంచిదని, శరీరానికి బలాన్ని ఇచ్చే పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం యోగా నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that not drinking enough water, iron deficiency, not having breakfast, not taking nutritious food causes weakness and tired. And suggested the things to be done to reduce the weakness and tiredness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X