health tips: విపరీతమైన మోకాలి నొప్పి వేధిస్తుందా? నడవలేకపోతున్నారా? అయితే ఈ పని చెయ్యండి!!
చాలామంది విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా మోకాలు సహకరించకపోవడంతో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. నడవాలన్నా, మెట్లు ఎక్కాలి అన్నా, పరిగెత్తాలి అన్నా, పని చేయాలన్నా మోకాలు నొప్పి ఎక్కువగా ఉన్నవారు తీవ్ర ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు. ఇక మోకాలు నొప్పి బాధ పడలేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారు అనేక మంది ఉన్నారు. అయితే ఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

మోకాలి నొప్పి ఇందుకే వస్తుంది
కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాలు లోపలి కణజాలం దెబ్బతింటుందని, దీని వల్ల లోపల మృదులాస్థి అరిగిపోవడం జరుగుతుందని, అటువంటి సమయంలో ఎటువంటి మూమెంట్ ఇచ్చినా తీవ్రమైన నొప్పి, మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మోకాలు నొప్పి రావడానికి విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం వంటివి కూడా కారణాలుగా ఉంటాయని చెబుతున్నారు.

ఆపరేషన్ కంటే మోకాలి నొప్పికి చెయ్యాల్సింది ఇదే
మోకాలు నొప్పి బాధను భరించలేక చాలామంది మోకాలు శస్త్రచికిత్సల బాట పడుతున్నారు. అయితే మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి సరైన ప్రయత్నం చేయకుండా, ఆపరేషన్లు చేయించుకోవడం మంచిది కాదని కూడా వైద్యులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఉదయం సూర్యరశ్మి మోకాలిపై పడేలాగా చూసుకోవడం, వైద్యులు సూచించిన కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం చేస్తే శస్త్రచికిత్స అవసరం లేకుండా మోకాలి నొప్పులు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.

మోకాలి నొప్పి ఉపశమనం కోసం వ్యాయామం అవసరం
సరైన పోషకాహారం తీసుకోవడం, బరువు తగ్గడం పై శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, చాలావరకు ఉపశమనాన్ని ఇస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. మోకాలి చుట్టూ ఉండే కండరాలు బలపడితే మోకాళ్ళ పై కొంతమేర ఒత్తిడి తగ్గి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నవారు మెట్లెక్కడం, ఏటవాలుగా ఉన్న ప్రదేశాలలో నడవడం వంటివి చేయకూడదని ఏరోబిక్స్, జుంబా వంటివి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మోకాళ్ళు వంచి చేసే వ్యాయామాలు కూడా చేయకూడదని సూచిస్తున్నారు.

కుర్చీలో సింపుల్ గా చేసే వ్యాయామం, నౌకాసనం, సూర్య నమస్కారాలు బెస్ట్
మోకాలి కండరాలను బలోపేతం చేసే నౌకాసనం వంటి ఆసనాలు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నౌకాసనం తో మోకాలి కండరాలు బలంగా మారడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు కుర్చీలో కూర్చుని చేసే సింపుల్ వ్యాయామాలు మోకాలి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. సూర్య నమస్కారాలు కూడా ఎంతో రిలీఫ్ ను ఇస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications