• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

International Beer Day:తయారు చేసింది పురుషులు మాత్రం కాదు.. ఎవరో ఊహించలేరు..

|
Google Oneindia TeluguNews

బీర్.. కుర్రకారు తెగ లైక్ చేస్తారు. సమ్మర్‌లో అయితే సేల్స్ మాములగా ఉండవు. ఇక పండగలు, పబ్బలు అయితే చెప్పక్కర్లేదు. అసలు బీర్ ఎలా తయారయ్యింది. దాని ఆవిర్భావం ఎలా జరిగిందనే అంశాలపై సామాన్యుల మెదడులను తొలచివేస్తోంది. ఇవాళ ఇంటర్నేషనల్ బీర్ డే.. అసలు బీరుకు ఓ రంగును..రూపు..రుచిని ఇచ్చింది. తెచ్చింది ఎవరో తెలుసా.. అంతా మహిళలేనని మీకు తెలుసా? ఇవాళ అంతర్జాతీయ 'బీర్ డే'.. గింజల సారా తయారు చేసినవాడు ఎవడో గానీ..మహా మేధావి అయ్యి ఉంటాడు అని బీరు రుచి మరిగిన గ్రీకు తత్వవేత్త ప్లాటో అన్నారు. బీరు తాగిన మత్తులో చెప్పాడో.. బీరు మత్తు గురించి చెప్పాడో గానీ బీరుకు మహా క్రేజీ ఏర్పడింది.

మహిళలే..

మహిళలే..

బీరును తయారు చేసింది, చరిత్రలో ఆ పానీయానికి పెద్ద ఎత్తున్న ప్రాముఖ్యత కల్పించి, అంతర్జాతీయంగా ప్రచారం చేసి.. ఇప్పుడు మార్కెట్‌లో విక్రయిస్తోన్న బీరుకు రూపం తెచ్చింది అంతా మహిళలే. 'బీర్‌ డే' సందర్భంగా అలనాడు బీరును తయారు చేసిన మహిళాలకు జోహార్లు చెప్పుకుందాం. 7 వేల ఏళ్ల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అప్పట్లో స్త్రీలు బలవర్థకమైన ఆహారం.. అంబలి కాచుకునేవారు. అంబలి అంటే అందరూ కాచుకునేదే. కానీ కొంతమంది మరీ డిఫరెంట్‌గా కాస్తారు. అలా కొందరు మాత్రం ధాన్యాలకు మూలికలను కూడా కలిపి వాటిని నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసేవారు. మరిగించిన ఆ పానీయాలను నిల్వ చేసేవారు. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచికి మారేవి. అవి తాగితే మత్తుగా మధురంగా ఉండేది. అప్పట్లో వాటిని మత్తు ద్రావణాలనే ప్రచారం జరిగింది. మత్తు వారికి బాగుండేది. ఏదో లోకంలో విహరించినట్లుగా.. సరదాగా ఉండేది. దాంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.

వేల ఏళ్ల క్రితమే

వేల ఏళ్ల క్రితమే


సారాయి అమ్మకాల సంప్రదాయం వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. ఏదైనా కొత్తగా తయారుచేశాక వాటికి ఇంకొంత కొత్తదనాన్ని జోడించటం సాధారణమే. అలా ఆ పానీయాలకు మరింత రుచిని జోడించి తయారుచేసేవారు. కొత్త రకం రుచి జోడవవ్వటంతో ఆ పానీయాలకు మార్కెటింగ్‌ పెంచారని బ్రిటిష్‌ చరిత్రకారుడు సొమ్మెలియర్‌ జేన్‌ పెయిటోన్‌ తెలిపారు. ఈజిప్షియన్లు ఆ కాలంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు మద్యం సేవించేవారు. ఇళ్లలోనే మద్యాన్ని తయారు చేసుకునేవారు. ఆ సమయంలో బీర్‌ లాంటి పానీయాలు చెలామణిలో ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. మంచి నీళ్లు, టీ, కాఫీ తర్వాత ఎక్కువ మంది తాగేది.. బీరే కావటం విశేషం.

పులిసిన పానీయాలు..

పులిసిన పానీయాలు..


మధ్యయుగం నాటికి.. పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం బాగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల వరకూ అంతా వాటికి అలవాటుపడ్డారు. పులిసిన పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కాదు. పాచి వాసన వచ్చేవి. దీంతో రకరకాల ప్రయోగాలు చేశారు. ప్రయోగాల్లో భాగంగా గంజాయి మొక్కలకు చెందిన హోప్స్‌ పువ్వులను వేచి కాచేవారు. అవి ద్రావణాలను పాడుకాకుండా ఉంచడంతోపాటు మత్తు పాళ్లు కాస్త పెరిగాయి. అలా బీరులోకి కిక్ మొదలైంది. జర్మనీకి చెందిన క్రైస్తవ సన్యాసి.. హిల్డెగార్డ్‌ ఆఫ్‌ బింగెన్‌ విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్‌కు ఒక రూపం తీసుకొచ్చారు. పులిసిన పానీయాలను డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌గా మార్చేయాలనే ఆలోచన వచ్చింది మాత్రం మగవాళ్లకే.. ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్‌ను పక్కనపెట్టేసి.. బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్‌ను ఎక్కించారు.బీర్‌ వెనుక ఆడవాళ్ల కృషిని తెర వెనక్కి నెట్టేసి.. అప్పటి నుంచి బీర్ల పరిశ్రమలో కింగ్‌లుగా పురుషులు చెలామణి అవుతున్నారు.

తొలి శుక్రవారం

తొలి శుక్రవారం


ఆగస్ట్ మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీరు దినోత్సవం. ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొడితే నాలుగు పెగ్గులు వేస్తూ నాలుగు బీరు బాటిల్స్ లాగించేయటమే ఈ బీర్ డే స్పెషల్. బీర్‌ ప్రియుల కోసం బీర్‌కు జరిపే పుట్టిన రోజు ఇది. 2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్‌కు చెందిన జెస్సే అవ్‌షాలోమోవ్న్‌ అనే ఒకరు.. ఈ బీర్‌ డే పుట్టుకకు కారణం. 2012 దాకా ఆగష్టు 5నే ఇంటర్నేషనల్‌ బీర్‌ డేను జరిపేవారు. ఆ తర్వాత ఆగష్ట్ మొదటి శుక్రవారంను బీర్‌ డేగా నిర్వహించుకోవాలని మందుబాబులకు పిలుపునిచ్చాడు జెస్సే. పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన ఈ రోజు.. ఇప్పుడు దాదాపు 80కి పైగా దేశాల్లో జరుగుతోంది. 200 నగరాల్లో ఈ బీర్‌ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో మన భారత్ కూడా ఉంది.

ఇంటర్నేషనల్ బీర్ డే

ఇంటర్నేషనల్ బీర్ డే

దాదాపు అన్నీ దేశాల్లో ఇంటర్నేషనల్ బీర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కుర్రకారు బీర్లు పొంగిస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు. కామన్‌గానే నలుగురు కలిస్తే.. బీర్లు పొంగుతాయి. ఇక సెలబ్రేషన్ టైం కావడంతో.. దానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బీర్ల సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. వేసవి కాదు.. ఇతర సీజన్‌లలో కూడా బీర్ల సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇటు ప్రభుత్వాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. వాటిని జీతాలు, ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

English summary
today International Beer Day. thousand years ago women invent beer after that men marketing the beer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X