• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అసెంబ్లీ సాక్షిగా... మందలగిరి పప్పు అంటూ లోకేష్ పై ఆ మంత్రి వర్యుల సెటైర్లు

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం 17 జూన్ న తిరిగి మొదలయ్యాయి. వాడీ వేడిగా సాగుతున్న గవర్నర్ ప్రసంగంపై దన్యవాద తీర్మానం సంధర్భంగా అసెంబ్లీలో రచ్చ గత ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు అంటూ యూటర్న్ తీసుకుంది . సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరాక తొలిసారిగా జరుగనున్న సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలోనే సాగుతుంది . అధికార పార్టీ మంత్రులకు, ప్రతిపక్ష పార్టీ నేత అచ్చెం నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది . ఇక ఈ వాగ్వాదంలో లోకేష్ వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యాడు.

లోకేష్ పై సెటైర్లు వేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ .. మంగళగిరిని మందలగిరి అని పిలిచే పప్పును కాను అంటూ వ్యాఖ్యలు

లోకేష్ పై సెటైర్లు వేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ .. మంగళగిరిని మందలగిరి అని పిలిచే పప్పును కాను అంటూ వ్యాఖ్యలు

గవర్నర్ ప్రసంగంలో అమరావతి, సెక్రెటేరియేట్, అసెంబ్లీ, పోలవరం ప్రాజెక్టులు గురించి మాట్లాడలేదని అచ్చెం నాయుడు విమర్శించారు.ఇక పోలవలం గురించి ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ మాట్లాడిన తర్వాత అచ్చెం నాయుడు మాట్లాడుతూ ఏదో అదృష్టం కలిసివచ్చి ఇరిగేషన్ మంత్రి అయిన వ్యక్తి మా బాబుగారికి నీతి పాఠాలు చెబుతుంటే బాధగా అనిపిస్తుందని పేర్కొన్నారు . ఇక దీనితో అనిల్ కుమార్ చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు . అధ్యక్షా! ఆయన కొడుకు మాదిరి కనీసం నియోజకవర్గాన్ని పేరు పెట్టి పిలవలేక,"మంగళగిరిని మందలగిరిగా పిలిచే పప్పు" ని మాత్రం నేను కాదు అంటూ పేర్కొన్నారు . నేను ఈ పదవికి కొత్తే కావచ్చు, కానీ తొందరగానే నేర్చుకుంటామని తెలిపారు . కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేని వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి,మంత్రిని చేసిన మీ పప్పు లాంటివాడిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. నలభై సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారికి ఉండవచ్చు, అంత మాత్రాన ఆయన తప్పులు చేస్తూ,దోచుకోని తింటూ ఉంటే సైలెంట్ గా ఉండలేము అని పేర్కొన్నారు. ఆయన చేసిన తప్పులను మేము చెపుతుంటే, ఆలా చెప్పకూడదు, యంగ్ స్టార్స్ రాకూడదు అంటే కుదరదు. చూపిస్తాం మా పవర్ ఏమిటో చూపిస్తాం. 45 రోజుల్లో అన్ని బయటకు తీస్తాం అంటూ చాలా ఘాటుగా మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్.

అచ్చెం నాయుడికి , మంత్రి అనీ కుమార్ యాదవ్ కు మధ్య వాగ్వాదం .. టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ

అచ్చెం నాయుడికి , మంత్రి అనీ కుమార్ యాదవ్ కు మధ్య వాగ్వాదం .. టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ

ఇక అచ్చెం నాయుడు 5ఏళ్ల పాటు సమర్ధవంతమైన పాలన అందించామని, వైసీపీ మాటలకు చేతలకు పొంతన లేదని, పోలవరం విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్‌లో ఉందని, ప్రాజెక్ట్‌ను కేంద్రానికి వదిలేశామని సీఎం ఢిల్లీలో చెప్పారని, విజయవాడ రాగానే పోలవరంపై సీఎం మళ్లీ మాట మార్చారని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై వెంటనే కలుగజేసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇంకా మారలేదని అన్నారు . ఇప్పటికైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు . ఐదేళ్ల టీడీపీ పాలనలో దుర్మార్గంగా వ్యవహరించిందని , కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం నడిపిందని విమర్శలు చేశారు. ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన లేకుండా వేల కోట్లు ప్రజల సొమ్మును టీడీపీ దోచుకుందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

చంద్రబాబు పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా .. అసభ్య రాతలు .. కేసునమోదు

అసెంబ్లీలో లేకున్నా లోకేష్ కి తప్పని సెటైర్లు

అసెంబ్లీలో లేకున్నా లోకేష్ కి తప్పని సెటైర్లు

ఇక నిన్న కాక మొన్న వచ్చి నీతులు చెప్తారా అన్న వ్యాఖ్యలకు నిన్న గాక మొన్న వచ్చినా సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిని కూడా మందలగిరి అని పేరు కూడా సరిగా పిలవలేని పప్పుని కాదు అంటూ లోకేష్‌ను ఉద్ధేశించి సెటైర్లు వేశారు వైసీపీ మంత్రి . ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి కట్టబెట్టారంటూ టీడీపీ ప్రభుత్వంపై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అసెంబ్లీలో లేకున్నా లోకేష్ మీద మాత్రం సెటైర్లు తప్పటం లేదు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After speaking Irrigation Minister Anil Kumar about the Polavalam, Achchem Naidu said, "It is sad that a person who is the Minister of Irrigation has been by luck. he is criticizing chandrababu . With this, Anil Kumar gave a very serious counter. Presidential ..! chandrababu's son who did not name at least the constituency and said, "I am not the one who calls Mangalagiri as Mandalagiri".I may be new to the position, but will learn soon . Clarity is given to those who cannot win even atleast MLA, MLC, and not like a pappu . Chandrababu may have more than forty years of experience, but we cannot be silent if he makes mistakes .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more