గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. మెడికల్ గోడౌన్‌లో పేలుడు, ఇద్దరు మృతి
గుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని శీలం వారి వీధిలోని ఓ భవన సముదాయంలో పేలుడు సంభవించింది. మెడికల్ షాపు గోడౌన్ నుంచి శబ్ధం వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. పేలుడు ధాటికి భవనంలో ఉన్న మిగతా షాపుల్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసమైపోయింది. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు.
మెడికల్ గోడౌన్‌లో ప్రమాదంతో భారీ శబ్ధం వినిపించింది. ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ గోడౌన్ యజమాని రామారావు, మరొకరు ఉన్నారని తెలుస్తోంది. వారు ఏసీ పైప్ రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడుతో రామారావు, మరొకరు చనిపోయారు. పేలుడుతో గోడౌన్‌లో ఉన్న మందులు, ఇతర సామాగ్రి, ఫ్రీజ్, ఏసీ ఇతర వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. భవన సముదాయంలో ఉన్న షాపుల్లో గల ఫర్నీచర్ కూడా ధ్వంసమైపోయింది.

గోడౌన్‌లో ఏసీ పైపు రిపేర్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గోడైన్‌లో ఉన్న సామాగ్రి పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే అక్కడ ఇనుముకు సంబంధించి వస్తువులు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందా అనే సందేహం కలుగుతుంది. కొన్ని మందులు ఉన్న ప్రీజులు కూడా తునతునాకలైపోయాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనేందుకు అన్వేషిస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications