గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనో మూర్ఝుడిని- కరోనా వ్యాప్తి చేస్తాను- గుంటూరులో కరోనా సెల్ఫీ పాయింట్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఓ వైపు కల్లోలం రేపుతుంటే లాక్ డౌన్ ఉల్లంఘనులు మాత్రం ఇవేవీ పట్టనట్లుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా జనాల్లో తిరుగుతూ అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు దాదాపు ప్రతీ చోట పోలీసులు విన్నూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు అధికంగా ఉన్న గుంటూరు జిల్లాలో పోలీసులు కూడా ఇలాంటి ఓ ఐడియా రూపొందించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

 గుంటూరులో కరోనా విజృంభణ...

గుంటూరులో కరోనా విజృంభణ...

ఏపీలో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. కరోనా ధాటికి గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య ఇవాళ్టికి 195కు చేరుకుంది. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కారణంగా ఈ జిల్లాలో కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో రెడ్ జోన్లతో పాటు లాక్ డౌన్ అమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు. చివరికి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రహదారులు సైతం మూసేశారు. అయినా ఇంకా కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

రూరల్ పోలీస్ విన్నూత్న ఆలోచన..

రూరల్ పోలీస్ విన్నూత్న ఆలోచన..

లాక్ డౌన్ ఉల్లంఘించవద్దంటూ ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో గుంటూరు రూరల్ కొల్లూరు పోలీసులు ఓ విన్నూత్న ఆలోచన చేశాడు. తాము కాపలా కాసే చోట రోడ్డు పక్కన ఓ బోర్డు ఏర్పాటు చేయించాడు. దానిపై లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్ల పైకి వచ్చు వారికి వినూత్న శిక్ష, నేను మూర్ఖుడిని నేను మాస్క్ పెట్టుకోను,
పనీ పాటా లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను అంటూ రాయించారు. గ్రామంలో తిరిగే వారిని ఇక్కడికి తీసుకొచ్చి సెల్ఫీలు తీయిస్తున్నారు. వారి చేతే సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్ పెట్టిస్తున్నారు. దీంతో జనం ఇటు వచ్చేందుకు జంకుతున్నారు.

Recommended Video

Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown
సెల్ఫీ పాయింట్ తో తగ్గిన రాకపోకలు..

సెల్ఫీ పాయింట్ తో తగ్గిన రాకపోకలు..

కొల్లూరు పోలీసులు ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ఇప్పుడు బాగా పనిచేస్తోంది. అనవసరంగా రోడ్లపైకి తిరిగే వారు ఇక్కడికి వచ్చి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో దాన్ని మిగతా వారు కూడా షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇదంతా ఎందుకొచ్చిన సమస్య అనుకుంటూ జనం ఇళ్లవద్దనే ఉండిపోతున్నారు. పోలీసుల శ్రమ కూడా తగ్గింది. జనం మాట వినకుంటే ఇలాంటి చర్యలను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

English summary
for controlling coronavirus lockdown violations gutur rural police launches a coronvirus selfie point. police put a board beside road written that "i am a fool, i am spreading virus without wearing a mask and roaming on roads". after taking a selfie viola police asked them to put the picture as their profile pic in social media accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X