గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

SP Balu : ఎస్పీ బాలుకు అవమానం- గుంటూరులో విగ్రహం తొలగించిన కార్పోరేషన్..

|
Google Oneindia TeluguNews

దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి గుంటూరులో అవమానం జరిగింది. ఎస్పీ బాలు మృతి తర్వాత ఆయన జ్ఞాపకంగా స్ధానిక కళాకారులు పెట్టిన విగ్రహాన్ని కార్పోరేషన్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా తొలగించేశారు. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం పెట్టినందువల్లే తొలగించినట్లు కార్పోరేషన్ అధికారులు చెప్తున్నారు.

గుంటూరు మదర్ థెరీసా జంక్షన్ లో ఎస్పీ బాలు మరణానంతరం స్ధానిక కళాదర్బార్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందుకోసం మున్సిపల్ అధికారుల్ని అనుమతి కోరినా రెండేళ్లుగా తిప్పడంతో చేసేది లేక కళాదర్బార్ ఈ విగ్రహం ఏర్పాటు చేసింది. దీంతో అధికారులు ఆగ్రహంతో దాన్ని తొలగించారు. ఈ వ్యవహారం స్ధానికంగా కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ఎస్పీ బాలు విగ్రహం కూడా ఇదే. దీన్ని కూడా అధికారులు నిబంధనల పేరుతో తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

insult to legendary singer sp balasubrahmanyam-guntur corporation removed statue midnight

ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు కోసం అనుమతి కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, అనుమతి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నామని, కానీ వారు కనికరించలేదని కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు తెలిపారు. ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసుకుంటే కార్పోరేషన్ అధికారులు అక్రమమంటూ తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహాగాయకుడికి గుంటూరు కార్పోరేషన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. గుంటూరులోనే అనుమతి లేకుండా దాదాపు 200 విగ్రహాలు రోడ్లపై ఉన్నాయని, అయినా వాటికి అడ్డురాని నిబంధనలు, ఒక్క ఎస్పీ బాలు విషయంలోనే అడ్డొచ్చాయా అని కళాకారులు మండిపడుతున్నారు.

English summary
guntur municipal corporation has removed sp balasubrahmanyam statue in the city for illegal reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X