కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు: అసెంబ్లీ సాక్షిగా కమ్మ సామాజికవర్గానికి పిలుపు..

Recommended Video

    AP 3 Capitals : Kodali Nani Satires On Chandrababu Vision 2020 || Oneindia Telugu

    కమ్మ కులస్తుల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ రాజధానిని తరలిస్తున్నారన్న వాదనలో ఒక్కశాతం కూడా నిజం లేదని, చంద్రబాబు, ఆయన పచ్చమీడియా అధిపతులు కలిసి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో ప్రచారం వల్ల.. అమరావతిని నిర్మించిందే కమ్మవాళ్ల కోసమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా కలిగిందన్నారు. రాజధానుల తరలింపునకు సంబంధించిన 'వికేంద్రీకరణ బిల్లు'పై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి నాని ప్రసంగం ఆయన మాటల్లోనే...

     ‘‘రాజధానిని విశాఖపట్నంకు

    ‘‘రాజధానిని విశాఖపట్నంకు


    ‘‘రాజధానిని విశాఖపట్నంకు తరలించాలనే నిర్ణయంపైనా కుల రాజకీయాలు చేస్తే ఎలా? గతంలో విశాఖలో ఎన్నికైనవారంతా కమ్మవాళ్లు కాదా? రాజధాని తరలింపు వల్ల కమ్మవాళ్లకు ఏ ఇబ్బందీ రాదు. ఇకపోతే వైజాగ్ లో ఉన్న డాల్ఫిన్ హోటల్ కమ్మవాళ్లు పెట్టిందే.. దస్ పల్లా హోటల్ మాదే.. నోవాటెల్, బ్రాండ్ వే హోటళ్లతోపాటు.. 80 శాతం థియేటర్లు.. హుందాయ్ షోరూమ్ లు.. నారా లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీతోపాటు వైజాగ్ లో ఉన్న విద్యా సంస్థలన్నీ కమ్మవాళ్లవే.. సినిమా స్డూడియోలు, హాస్పిటళ్లు.. వైజాగ్ లో ఉన్న వ్యాపార సంస్థల్లో 50 శాతాకిపైగా కమ్మవాళ్లవే.

    కమ్మసోదరులారా..

    కమ్మసోదరులారా..

    రాష్ట్రంలో ఉన్న కమ్మసోదరులు ఎవరూ కూడా చంద్రబాబు మాటలు నమ్మొద్దు. కమ్మవాళ్లకు నష్టం చేసే పనిని సీఎం జగన్ చేయబోరు. ఎక్కడికెళ్లినా వ్యాపారాలు, ఉద్యోగాలు చేయగలం మనం. జగన్ కు కులపిచ్చే ఉంటే రాజధానిని కడపలోనో, కర్నూలుకో తరలించేవారుకదా. ఇప్పుడు మనకు రెండు రాజధానులు వచ్చాయి. ఎక్కడికైనా మనం వెళ్లొచ్చు. చంద్రబాబు తన రాజకీయాల కోసంమే జాతి ప్రయోజనాలతో ఆడుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో మిగతావాళ్లకన్నా కమ్మవాళ్లే చంద్రబాబును ఎక్కువగా నమ్ముతారు.. అది తెలుసుకాబట్టే ఆయన రోడ్లమీదికొచ్చి అరెస్టుల డ్రామాలు చేస్తున్నారు.

    బాబుది మూర్ఖత్వం..

    బాబుది మూర్ఖత్వం..


    రాజధానిని అమరావతిలోనే ఉంచాలని రెండు జిల్లాల ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను బెదిరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయ్యా.. బెదిరిస్తే భయపడటానికి ఆయన(జగన్) చంద్రబాదు కాదుగా. అయినా మేమెందుకు బెదిరించాలి? తాను ఏది చెప్పినా వింటారన్న దుస్థితిలో ప్రజలు ఉన్నారనుకోవడం చంద్రబాబు మూర్ఖంత్వం. ఎన్నికల టైమ్ లో ఆయనిచ్చిన బిల్డప్ ను ప్రజలు నమ్మి ఉంటే జగన్ సీఎం ఎలా కాగలిగేవారు? ప్రజలు అన్నీ ఆలోచించే ఓటేస్తారు. మనం రెచ్చగొడితేనో, జోలెపట్టి నాటకాలాడితేనో సింపతీ రాదు. పాపాల భైరవుడు లాంటివాడు అడుక్కుతింటే జనం ఆనందపడతారు.. వీడెన్ని పాపలు చేస్తే ఆఖరికి ఏం ఖర్మ పట్టిందనే అంటారు తప్ప జాలి చూపించరు.

    విజన్ 2020 సాధించారు

    విజన్ 2020 సాధించారు

    విజన్ 2020 అని చెప్పారు.. ఇప్పుడు 2054 అని అంటున్నారు. ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్పాలిగానీ తర్వాతి సీఎంలు కూడా ఏం చెయ్యాలో చంద్రబాబే డిసైడ్ చేస్తే ఎలా? మొన్న ఎన్నికల్లో 23 సీట్లు గెలిచారు. అందులో ఇద్దరు ఆయన్నివదిలేశారు. బాబు కాకుండా టీడీపీలో 20 మంది మిగిలారు. ఇవాళ తేదీ కూడా జనవరి 20. ఆయన నాలుగు దశాబ్దాల చరిత్రను కలుపుకుంటే 2020 సరిగ్గా సరిపోతుంది."

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+