ప్రధాని మోదీ గనక చంద్రబాబు చెప్పిన మాట వింటే..!!
బాపట్ల: వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. దీనికోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం- అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జీ20 షెర్పా సమావేశం కూడా కొనసాగుతోంది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్.. వంటి వివిధ దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొనే సమ్మిట్ కావడం వల్ల కేంద్రం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

అఖిల పక్షంతో షురూ..
అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, సుబ్రహ్మణ్యం జైశంకర్, ప్రహ్లాద్ జోషి, నిర్మల సీతారామన్, పియూష్ గోయెల్, రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, ప్రేమ్ సింగ్ తమాంగ్, ఏక్‌నాథ్ షిండే, అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.

డిజిటల్ నాలెడ్జ్‌పై
ఈ అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దేశ భవిష్యత్ కోసం వచ్చే 25 సంవత్సరాలకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ పాతికేళ్లల్లో భారత్ ప్రపంచదేశాల్లోనే అగ్రస్థానానికి చేరకుంటుందని అన్నారు. యువ శక్తి దేశానికి ఉన్న ప్రధాన బలం అని, వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానవ వనరులు, నాలెడ్జ్ ఎకానమీని అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు.

చంద్రబాబు చేసిన సూచనలపై..
చంద్రబాబు చేసిన సూచనలపై తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. దేశ పురోగమనానికి తమ అధి నాయకుడు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారంటూ ప్రశంసిస్తోన్నారు. 20 సంవత్సరాల కిందటే విజన్ 2020తో రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు బాటలు వేశారని, ఇప్పుడు దేశం పురోగమించడానికి అలాంటి విజన్ డాక్యుమెంట్ అవసరమని వ్యాఖ్యానిస్తోన్నారు. వచ్చే పాతికేళ్లల్లో ప్రపంచంలోనే భారత్ రెండో అత్యుత్తమ దేశంగా ఆవిర్భవిస్తుందని పేర్కొంటోన్నారు.

రాళ్ల గుట్టని సైబరాబాద్‌గా..
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. మరో అడుగు ముందుకేశారు. రాళ్ల గుట్టను సైబరాబాద్‌గా మలిచిన విజన్ చంద్రబాబు నాయుడిదని వ్యాఖ్యానించారు. జీ20 శిఖరాగ్ర సమావేశంపై ఢిల్లీలో ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అదే విజన్‌ను వినిపించారని చెప్పారు.

దార్శనికుడు..
దేశాన్ని ముందుకు నడిపించగల దార్శనికుడని గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. వచ్చే 25 ఏళ్లలోదేశం ప్రపంచ పటంలో రెండో స్థానంలో ఉంటుందని చంద్రబాబు చెప్పారంటే అది జరిగి తీరుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి నాయకుడు పది సంవత్సరాల పాటు పాలిస్తే ఢిల్లీని తలదన్నే స్థాయిలో మన రాష్ట్రం అభివృద్ధి జరిగి తీరుతుందని ఆయన పేర్కొన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications