గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరిలో లోకేష్ ను వైసీపీ గెలిపిస్తుందా ? ముక్కోణపు పోరుతో ఎవరికి లాభం ! గంజి చేరికే టర్నింగ్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్ల పోటీ కోసం ఏరికోరి ఎంచుకున్న మంగళగిరిలో ఆయన గెలుస్తారా లేదా అన్న చర్చతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. అయితే చివరికి ఆయన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఓడిపోయారు. అయితే వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గం మరోసారి పొలిటికల్ వార్ కు కేంద్ర బిందువు కాబోతోంది. దీనికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణం.

లోకేష్ కేంద్రంగా మంగళగిరి రాజకీయం

లోకేష్ కేంద్రంగా మంగళగిరి రాజకీయం


గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫైట్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలకు చాలా సమయమే ఉన్నా ఇక్కడ రాజకీయాలు మాత్రం ఇప్పుడే వేడెక్కేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నారా లోకేష్. ఆయన కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు. లోకేష్ ఎంట్రీతో తనకు అసెంబ్లీ సీటు దక్కదని భావించి టీడీపీకి గుడ్ బై చెప్పేసిన సీనియర్ నేత గంజి చిరంజీవి, దాదాపు అదే కారణంగా ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయి ఎమ్మెల్సీగా మారిన మురుగుడు హనుమంతరావు, ఇప్పటికే లోకేష్ ను ఓసారి ఓడించి, మరోసారి టికెట్ దొరికితే మళ్లీ ఓడిస్తానని ధీమాగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీంతో మంగళగిరి పాలిటిక్స్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

 లోకేష్ కోసం వైసీపీ ఎత్తులు

లోకేష్ కోసం వైసీపీ ఎత్తులు

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారి బరిలోకి దిగిన లోకేష్ ను విజయవంతంగా ఓడించిన వైసీపీకి ఈసారి స్ధానికంగా పరిస్దితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం అమరావతి పోరు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో తనకు అనుకూలంగా ఇక్కడి రాజకీయాన్ని మార్చుకోవాలని భావిస్తూ ప్రచారానికి దిగిన లోకేష్ పై పైచేయి సాధించేందుకు వైసీపీ తంటాలు పడుతోంది. ఇదే క్రమంలో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీని చేసింది. అదే సమయంలో టీడీపీకి పార్టీ సీనియర్ నేత గంజి చిరంజీవి గుడ్ బై చెప్పేశారు. వైసీపీలోకి ఆయన చేరిక ఖాయమని కూడా చెప్తున్నారు. దీంతో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు గంజిని కూడా కలుపుకుని లోకేష్ కు చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

 గంజి చేరితే వైసీపీలో ముక్కోణపు పోరు ?

గంజి చేరితే వైసీపీలో ముక్కోణపు పోరు ?

వైసీపీలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేతో పాటు మురుగుడు హనుమంతరావు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ఆశలు పెట్టుకుంటున్నారు. ఆర్కేకు వ్యతిరేకంగా మారుతున్న పరిస్ధితుల్ని ఎలాగైనా క్యాష్ చేసుకునేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు ప్రయత్నిస్తున్నారు. ఆర్కేను కాదంటే తనకే టికెట్ దక్కేలా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పేసిన గంజి చిరంజీవిని వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి అంతిమంగా ఆర్కేతో పాటు మురుగుడు, గంజి చిరంజీవి మధ్య ముక్కోణపు పోరుకు దారి తీసేలా ఉన్నాయి.

Recommended Video

జగన్ కి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మంత్రులు *AndhraPradesh | Telugu OneIndia
లోకేష్ ను వైసీపీయే గెలిపిస్తుందా ?

లోకేష్ ను వైసీపీయే గెలిపిస్తుందా ?

మంగళగిరిలో తొలి విజయం కోసం లోకేష్ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆయన్ను ఎలాగైనా ఓడించేందుకు టీడీపీని బలహీనం చేస్తూ జగన్ ముందుకెళ్తున్నారు. మరోవైపు లోకేష్ ను ఓడించేందుకు సిద్ధం చేసుకుంటున్న పావుల మధ్యే పోరు పెరుగుతోంది. ఈ సమయంలో గంజి చిరంజీవి కూడా వైసీపీలోకి వచ్చేస్తే ఆయన మరో పోటీదారు కావడం ఖాయం. అప్పుడు జగన్, మురుగుడు, గంజిలో జగన్ ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మరో ఇద్దరు ఏకమై ఆయన్ను ఓడించడం ఖాయం. మరి ఈ పరిస్ధితుల్ని జగన్ ఆహ్వానిస్తారా లేక ముందే ప్రత్యామ్నాయాలు చూపిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ మురుగుడుకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయనకు జగన్ భవిష్యత్తు హామీలేవీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి వైసీపీలో చేరితే మాత్రం ఇవ్వక తప్పదు. అదే జరిగితే వైసీపీలో త్రిముఖ పోరు అంతిమంగా లోకేష్ ను గట్టెక్కించే అవకాశముందన్న చర్చ మొదలైంది.

English summary
after resignation to tdp, mangalagiri leader ganji chiranjeevi is planning to join ysrcp soon. and it will affect nara lokesh's chances also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X