గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ నేత ఆర్థిక మూలాలపై గట్టి దెబ్బ: సంగం డెయిరీ..సర్కార్ చేతికి: ప్రత్యేకాధికారిగా

|
Google Oneindia TeluguNews

గుంటూరు: సంగం డెయిరీ.. కొద్దిరోజులు రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వినిపిస్తోన్న పేరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్‌కు చెందిన పాలు, పాల ఆధారిత పదార్థాల తయారీ సంస్థ ఇది. ఇప్పుడిది..దాదాపుగా ప్రభుత్వపరమైనట్టే. సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే కారణంతో ధూలిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది కాస్తా రాష్ట్ర రాజకీయాల్లో మరింత దుమారానికి కేంద్రబిందువైంది.

గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారులకు..

గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారులకు..

సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ)కు బదలాయించింది. ఏపీడీడీసీ తరఫున గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ లిమిటెడ్.. ఈ డెయిరీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ధూలిపాళ్ల నరేంద్ర అరెస్టయిన నేపథ్యంలో.. ఈ డెయిరీ రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోకూడదనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

మూడు నెలల పాటు మాత్రమే..

మూడు నెలల పాటు మాత్రమే..

మూడునెలల పాటు ఇది గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ లిమిటెడ్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఆ తరువాత అప్పటి పరిస్థితుల ఆధారంగా.. దీన్ని పొడిగించడమా? లేక మళ్లీ పాత యాజమాన్యానికి బదలాయించడమా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఉన్న సంగం జాగర్లమూడి డెయిరీ ఇక మూడు నెలల పాటు ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో కొనసాగుతుందని పేర్కొన్నారు.

డెయిరీ కార్యకలాపాలు స్తంభించిపోకుండా..

డెయిరీ కార్యకలాపాలు స్తంభించిపోకుండా..

ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్టయిన కారణంగా- ఈ డెయిరీ కార్యకలాపాలు నిలిచిపోకూడదని, పాల ఉత్పత్తిదారులు, పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సంగం డెయిరీ పర్యవేక్షణ బాధ్యతలను బదలాయించినట్లు తెలిపారు. పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్.. ఇతర లావాదేవీలన్నీ సజావుగా కొనసాగించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టినట్లు పూనం మాలకొండయ్య ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ప్రత్యేకాధికారిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

 పాల ఉత్పత్తి రెట్టింపు..

పాల ఉత్పత్తి రెట్టింపు..


కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాల ఉత్పత్తిని అత్యవసరంగా రెట్టింపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే సంగం డెయిరీలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దాన్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారులకు బదలాయించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఆదేశాల ప్రకారం.. జీవో వెలువడినప్పటి నుంచీ మూడు నెలల పాటు మాత్రమే ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే ప్రభుత్వం చేపట్టిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శనాస్త్రాలను ప్రభుత్వంపై సంధిస్తున్నారు.

English summary
Sangam dairy, led by TDP leader Dhulipalla Narendra is handover to Andhra Prades Dairy Development Corporation with immediate effect. Guntur District Milk Producers’ Cooperative Union Limited will takeover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X