మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తోండగా..కలకలం!!

Nara Lokesh: దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకొంటోన్నారు. దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Unauthorized drone was flying during the flag hoisting by the Minister Nara Lokesh

ఐటీ, మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. గుంటూరులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాకు చెందిన పలువురు పాలన, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

మంత్రి నారా లోకేష్.. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించారు పోలీసులు. అయినప్పటికీ- ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా.. అనధికారిక ఓ మహిళ యూట్యూబర్ డ్రోన్‌ను ఎగురవేశారు.

Unauthorized drone was flying during the flag hoisting by the Minister Nara Lokesh

మంత్రి నారా లోకేష్ పాల్గొన్న ఈ కార్యక్రమం మొత్తాన్నీ డ్రోన్స్‌తో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనికోసం ఆ మహిళా యూట్యూబర్ ఎలాంటి ముందస్తు అనుమతులను కూడా తీసుకోలేదు. తాను నిర్వహిస్తోన్న ఓ యూట్యూబ్ ఛానల్‌ కోసం డ్రోన్‌ను ఎగురవేశారు. దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు.

దీన్ని గుర్తించిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చిత్రీకరించినట్లు ఆ మహిళా ఆపరేటర్ అంగీకరించారు. ఆ డ్రోన్‌ను సీజ్ చేశామని అదనపు ఎస్పీ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+