వైసీపీ ఎమ్మెల్యే ఆనం షాకింగ్ కామెంట్స్ .. ఈసారి టార్గెట్ అఫీషియల్స్
మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగాలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లాలో విద్య,వైద్య,సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారు చేయలేదని, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్న తీరును గతంలో ఎప్పుడూ చూడలేదని ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అధికారులపై ఆనం ఆగ్రహం
ఏడాది నుండి వెంకటగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, అభివృద్ధి కోసం మంత్రులకు ఇచ్చిన డీపీఆర్ లు ఎక్కడున్నాయో కూడా తెలియదని రామనారాయణ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు.వెంకటగిరి నియోజకవర్గాన్ని జిల్లా అధికారులు మర్చిపోయారేమో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జలవనరుల శాఖాధికారులు నీళ్ళు అమ్ముకుంటున్నారన్న ఆనం
ఇక జలవనరుల శాఖ అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఎస్‌ఎస్ కెనాల్‌ను పరిశీలించాలని చెప్తే పట్టించుకోవటం లేదన్నారు. సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు వినడం లేదన్నారు. అధికారుల తీరు తనకు విస్మయం కలిగిస్తుంది అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పదవి అలంకారం కాదన్న ఆనం .. ప్రజల కోసం నిలదీస్తానని ప్రకటన
గతంలో 23 జిల్లాలకు మంత్రిగా పని చేసిన తనకు, ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని పేర్కొన్న రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రామనారాయణ రెడ్డి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు .. వైసీపీకి తలనొప్పిగా ఎమ్మెల్యే
ఇక గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యమేలుతోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లను టార్గెట్ చేసి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇక దీని పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఆనం రామనారాయణ భేటీ అయి మాట్లాడడంతో అప్పుడు ఆ వివాదం సద్దుమణిగింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారంగా మారాయి. అధికారి వైసీపీకి తలనొప్పిగా మారాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications