Hyderabad: నెల రోజుల్లో 1,04,000 ఓట్ల తొలగింపు..!

ఎన్నికల అధికారులు దొంగ ఓట్లు, అలాగే సరైన చిరునామా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం ఒక్క నెల వ్యవధిలోనే లక్షకు పైగా ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 15 మధ్య 104,000 ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇందులో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 14,536 ఓట్లను తొలగించారు. ఆ తర్వాతి స్థానాల్లో ముషీరాబాద్ (13,955), జూబ్లీహిల్స్ (10,297) ఉన్నాయి.

ఓటర్ల జాబితాలో ఉన్న ప్రామాణికం కాని ఇంటి నంబర్లు వంటి వ్యత్యాసాల కారణంగా తొలగింపులకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ఓటర్ల సమస్యలను సరిదిద్దేందుకు దాదాపు 4,500 మంది సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. వీరంతా ఓటర్ల జాబితాలను శుద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 125,000 కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు.

1 04 000 votes were deleted for Hyderabad district

తొలగించిన ఓట్లు, కొత్త వచ్చిన ఓట్లతో హైదరాబాద్ లో 21,000 ఓట్లు మాత్రమే పెరిగాయి. హైదరాబాద్ జిల్లాలో ఏప్రిల్ 25 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 45.7 లక్షల నుంచి 45.9 లక్షలకు చేరుకుంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. సరైన పత్రాలు లేకుండే తరలిస్తోన్న 4.48 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపించిన 123 మందికి రూ.3.32 కోట్లు విడుదల చేశారు.

నగదు స్వాధీనం గురించి ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే, వారు ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్‌కు 9618888110 లేదా కన్వీనర్‌కు 9177872240 నంబర్‌కు కాల్ చేయవచ్చు. హైదరాబాద్ లోక్ సభ స్థానికి సంబంధించి ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మాధవి లత, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+